"కాకాణితో మహిళల ర్యాలీ"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, నరుకూరు సెంటర్ లో "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" వారోత్సవాల్లో భాగంగా వేలసంఖ్యలో విచ్చేసిన మహిళలతో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
డా౹౹బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించిన మహిళలు. సంప్రదాయ కోలాటాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలు, బ్యాండ్ మేళాలు, మంగళవాయిద్యాలతో నెలకొన్న పండుగ వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ, నినాదాలతో పోటీపడి హోరెత్తించిన మహిళలు. మహిళలు, స్థానిక నాయకులతో కిటకిటలాడిన వీధులు. "జై జగనన్న" అంటూ.. హోరెత్తించిన మహిళల నినాదాలు. మహిళల హర్షధ్వానాల మధ్య ఆసక్తికరంగా సాగిన కాకాణి సందేశం.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మనమందరం ఎల్లవేళలా రుణపడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపేందుకు మహిళలతో ర్యాలీ నిర్వహిస్తే, పెద్ద ఎత్తున వేల సంఖ్యలో విచ్చేసి, మహిళా లోకం సత్తా ఏంటో!, నిరూపించారు. సర్వేపల్లి, నెల్లూరు జిల్లాలో కొనసాగక పోయి ఉంటే, మహిళలతో పాటు, అన్ని వర్గాల ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కునే వారు. నెల్లూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న, మనం నెల్లూరు కార్పొరేషన్ కు ఆనుకొని ఉన్న, సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో కాకుండా, బాలాజీ జిల్లాలో భాగమై ఉంటే, అనేక కష్టనష్టాలు ఎదుర్కోవల్సి వచ్చేది. సర్వేపల్లి ప్రజలు విద్య విషయంలో గానీ, వైద్య విషయంలో గానీ నెల్లూరు జిల్లా కేంద్రంపైన ఆధారపడే మనం, బాలాజీ జిల్లాలో కలిసి ఉంటే,నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్నా, ఆస్పత్రులకు వైద్యానికి వెళ్లినా, మన జిల్లాలో కాకుండా, పొరుగు జిల్లాలో పొందుతున్నామన్న అసంతృప్తి ఉండేది. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరులో కాక కడపలో కలుపుతారా! అని కొంతమంది తెలిసీ తెలియని జోకర్లు మొరుగుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగక పోయి ఉంటే, సత్తా చూపించే ఉండేవాళ్లమని "బాలనాగమ్మలో తిప్పడు" పాత్ర పోషిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని, ఇప్పుడు మొరిగే వారు ఆనాడు తిరుపతి పార్లమెంట్ లో కలిపినప్పుడు ఏమి చేయగలిగారో, ప్రజలకు తెలియచెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి, ధన్యవాదాలు తెలియజేయడం జీర్ణించుకోలేని కొందరు, ఎక్కడలేని ఉక్రోషం వెల్లగక్కుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేసి, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చిన మహిళలకు, స్థానిక ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వేపల్లి నియోజకవర్గ వారోత్సవాల్లో భాగంగా 5 మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాలు, పొదలకూరులో యూత్ బైక్ ర్యాలీ, ముత్తుకూరులో ప్రజా ర్యాలీ, సర్వేపల్లిలో ఉద్యోగుల ర్యాలీ, మనుబోలులో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ, తోటపల్లిగూడూరులో మహిళల ర్యాలీ విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ, పేరు, పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Post a Comment