మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం

 


 

  ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(49) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో అసుపత్రి వైద్యులు భార్యకు సమాచారం అందించారు.

 కాగా 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచిఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వారం రోజులపాటు దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి ఆదివారమే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు

ప్రపంచ ప్రఖ్యాత మాంచెస్టర్ యూనివర్సిటీ నుండి M. S c., డిగ్రీ పొంది,

ఇటీవల దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో లో పాల్గొని, 3.MOU ల ద్వారా, 3.వేలకోట్ల పెట్టుబడులు రప్పించడానికి విశేషం గా కృషి చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి..




ఇంగ్లాండ్ స్లాంగ్ ఇంగ్లీష్ అత్యద్భుతంగా మాట్లాడగల దిట్టగా ప్రసిద్ధి,

రాజకీయాల్లో ఎదిగే వయస్సులో అకాల మరణం అతి బాధాకరం.

మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఇతను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. ఇతను నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. ఇతను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు.
 


Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget