చెంగాళ్ళమ్మ ఆలయంలో చండీయాగం.
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట : కాల్లంగి నదిఒడ్డున వెలసివున్న భక్తుల కొంగుబంగారం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు నేడు మాఘ పౌర్ణమి సందర్భంగా చండీయాగం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో, చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి సమక్షంలో ఈ యాగం నిర్వహించారు. ఈ యాగానికి ఉభయకర్తలుగా హైదరాబాద్ కు చెందిన దువ్వూరు అభిరామ్ రెడ్డి, పూజిత దంపతులు వ్యవహరించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి ముంగుర అమరావతి, గోగుల తిరుపాలు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment