జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వ పరంగా అవసరమైన అత్యవసర సేవలను అందిస్తాం
జిల్లా కలెక్టర్ కె.వి. ఎన్. చక్రధర్ బాబు
నెల్లూరు కలక్టరేట్ : ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుండి సమ్మె పై వెళుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వ పరంగా అవసరమైన అత్యవసర సేవలను అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె.వి. ఎన్. చక్రధర్ బాబు తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ల తో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుండి సమ్మెకు వెళుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ప్రజలకు నిత్యావసర సేవలు అందించడంలో ఇబ్బందులు కలగకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర ప్రభుత్వ సేవలతో పాటు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో మరియు అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ల కు సూచించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) గణేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) విధేహ్ ఖరే, డి.సి.హెచ్. ఎస్. డా. ప్రభావతి మరియు అత్యసర సేవలకు సంబంధించిన శాఖాదిపతులు పాల్గొన్నారు.
Post a Comment