" కాకాణి కనుపూరు సచివాలయ సందర్శన"

 " కాకాణి కనుపూరు సచివాలయ సందర్శన"



శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కనుపూరు సచివాలయాన్ని సందర్శించి, ప్రభుత్వ పథకాలపై సమీక్షించి, గ్రామాభివృద్ధి పై అధికారులు, గ్రామస్థుల సమక్షంలో చర్చించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

నూతనంగా నియమితులైన వాలంటీర్లకు నియామక పత్రాలతో పాటు, గుర్తింపు కార్డులు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.

యానాది కుటుంబాలకు నూతనంగా మంజూరైన ఆధార్ కార్డులతో పాటు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు,  అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.

వృద్ధులకు చేతికర్రలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, కరోనా కష్టకాలంలో కూడా, క్రమం తప్పకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.  సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మనం ఎల్లవేళలా రుణపడి ఉండాలి.  గ్రామాలలో ప్రజల సమక్షంలో చేపడుతున్న సచివాలయ స్థాయి సమీక్షా సమావేశాలు, సంతృప్తికరంగా సాగుతున్నాయి.  సర్వేపల్లి నియోజకవర్గంలోని సచివాలయాలను సందర్శించడం

, ప్రజల సమస్యలను గుర్తించడం, వాటిని తక్షణమే పరిష్కరించడమే దినచర్యగా రూపొందించుకున్నాం.  తెలుగుదేశం హయాంలో మంత్రులుగా వెలగబెట్టిన వారు గ్రామాలలో ఉపన్యాసాలు దంచడం తప్ప, ప్రజలు సమస్యలు వివరిస్తే ఆగ్రహించడం, దుర్భాషలాడటం ఆనవాయితీగా ఉండేది.  అధికార పార్టీ శాసన సభ్యునిగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హంగులు, ఆర్భాటాలకు దూరంగా, ప్రజలతో మమేకమై, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.  యానాదులకు మొబైల్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటుచేసి, ఆధార్ కార్డులు జారీ చేయడంతో పాటు, ఇళ్లు మంజూరు చేయించి, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం.  యానాది కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలతో పాటు, బ్యాంకు ఖాతాలను కూడా తెరిపించి, పాస్ బుక్కులు అందిస్తున్నాం.  నూతనంగా నియమితులైన వాలంటీర్లు, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పార్టీలకతీతంగా, పారదర్శకంగా అర్హులైన వారందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు కృషి చేయాలి.  గ్రామాలలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్లు, తాగునీటి, సాగునీటి వసతి కల్పించడంతో, ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల పర్యటనలో వ్యక్తిగత సమస్యలపై తప్ప, గ్రామ అవసరాలపై దాదాపుగా అర్జీలు లేకుండా చేశాం.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా విజ్ఞప్తిని మన్నించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం శుభపరిణామం.  సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలోని ప్రజలకు ఎక్కడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం.





Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget