యూపీలో 5 కోట్ల రూపాయల పట్టివేత
యూపీలో మొదటి దశ ఎన్నికల వేళ పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసులు కాకాదేవ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో దాదాపు 5 కోట్ల రూపాయలను పట్టుకున్నారు.
ఇదే సమయంలో స్వరూప్ నగర్ ప్రాంతంలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి, కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంత డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇకఐటీ అధికారులు కూడా ఘటనా స్థలికి చేరుకొని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ 5 కోట్ల డబ్బు సీఎంఎస్ కంపెనీకి చెందిన వాహనంలో దొరికాయని పోలీసులు తెలిపారు. అయితే దీనిపై సీఎంఎస్ కంపెనీ బాధ్యులు ఈ విషయంపై స్పందిస్తూ కాన్పూర్‌కు చెందిన కెస్కో ఎలక్ట్రికల్ సంస్థకు చెందిన డబ్బు అని, వీటిని బ్యాంకుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అయితే వీరి దగ్గర వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు కూడా దొరకలేదని పోలీసులు పేర్కొన్నారు.
Post a Comment