జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం 37వ డివిజన్లో 59వ రోజు నిడారంబరంగా ప్రారంభమైంది.
ఉదయం 7 గంటలకు శివ అనే కార్యకర్త ఇంటి నుండి మొదలైన జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 37వ డివిజన్, క్రాంతి నగర్, భగవత్ పాలెం, రామ్ నగర్, మిలటరీ కాలనీ ప్రాంతాలలో ప్రతీ కార్యకర్తతో, ప్రతీ నాయకునితో వారి ఇంటిలోనే ఏకాంతంగా మాట్లాడుతూ, ఒక కార్యకర్త ఇంటి నుండి మరో కార్యకర్త ఇంటికి వెళ్లే మార్గమధ్యలో స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, సంక్షేమ పథకాలగురించి ఆరాతీస్తూ ముందుకు సాగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment