నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
పట్టణం లోని సాయినగర్ ST కాలనీ లో నేడు తెలుగు దేశం పార్టీ అద్వర్యంలో గౌరవ సభను నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పట్టణ టిడిపి అధ్యక్షుడు ఆకుతోట రమేష్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో టిడిపి తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి తో పాటు నియోజకవర్గం ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రజా వేదిక నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భముగా వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత టిడిపి పాలనలో సంక్రాంతికి ఇచ్చే రేషన్ కానుకలు ఈ ప్రభుత్వం మానేసిందని,ఎరువుల ధరలు పెంచి రైతులు కొనుగోలు చేయలేని పరిస్థితులకు తెచ్చేశారని ఆయన విమర్శించారు.అలాగే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శాసన సభలో ప్రజాసమస్యలను చేర్చించ కుండా సభ సమయాన్ని వృధా చేస్తున్నారని, ప్రాణాలు అడ్డుపెట్టైనా ఈ సారి చంద్రబాబు ను సీఎం చేయడానికి సహకరించాలి నెలవల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ టిడిపి కార్యదర్శి AG కిషోర్,టిడిపి నేతలు చిట్టేటి పెరుమాళ్,మాలకొండయ్య ,మంజుల తదితరులు పాల్గొన్నారు.
Post a Comment