ప్రైవేటు స్కూల్ వద్ద PDSU విద్యార్థి సంఘాలు ధర్నా.

ప్రైవేటు స్కూల్ వద్ద PDSU విద్యార్థి సంఘాలు ధర్నా.

నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:- పట్టణంలో నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ, శ్రీ చైతన్య  పాఠశాలల ముందు ధర్నా నిర్వహించారు విద్యార్థి సంఘాలు. అనంతరం PDSU జిల్లా కార్యదర్శి లోకేష్   మాట్లాడూతు ఈరోజు  నారాయణ,శ్రీచైతన్య అలాగే ప్రయివేటు విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో పరిమితం మించి ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఫీజుల కట్టని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా తరగతి గదులు బయట కూర్చోపెడ్తున్నారుని, గత 3 సంత్సరాలుగా కరోన వచ్చి పనులు లేక ప్రజలందరూ అల్లాడుతుంటే, విద్యార్థులు తరగతులకు దూరమై చదువు అందక సతమతమవుతు ఉంటే ఏమాత్రం కనికరం లేకుండా నూటికి నూరుశాతం ఫీజులను వసూలు చేయడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు . అందుకు గాను PDSU,SFI,AISF గా మేము యాజమాన్యాలను ఒకటే అడుగతావునామ్ కరోన సమయంలో లాక్ డౌన్ ఉన్నకుడా మీరు ఏ విధముగా ఐతే ఇల్లు ఇల్లు తిరిగి అడ్మిషన్లు అడుకున్నారో ఆ విధముగా అడుకొన్ని వసూళ్లు చేసుకొండే తప్ప పిల్లలను ఇబ్బంది పెడితే విద్యార్థి సంఘాలు గా ఉరుకోబోమని హెచ్చరిచారు.అనంతరం సూళ్లూరుపేట MEO కి మేమోరాండం అందజేశారు.ఇప్పటికీ MEO కి అనేకసార్లు అనేక రూపాలుగా మేమురాండం అందచేసి కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థలలో విపరీతంగా ఫిజులు వసూలు చేస్తున్నారని  చెప్పిన ఆయన నిమ్మకీ నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఏమాత్రం చర్య తీసుకోలేదని వాపోయారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  పాదయాత్రలో  బహిరంగసభలు నిర్వహించి ఏమని ప్రసంగించారో ఒక్కసారి గుర్తుతెచుకోండి నేను CM అయితే విద్యార్థుల నుండి అధిక ఫిజులు వసూళ్లు చేస్తున్న ఈ నారాయణ,శ్రీ చైతన్య విద్యాసంస్థలను రద్దు చేస్తాను అని ప్రసంగించారని కానీ ముఖ్యమంత్రి అధికారం చెప్పట్టి 3 సంత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర మారుమూల ప్రాంతాలలో చిన్న విద్యాసంస్థనైనా రద్దు చేసినట్లు దాఖలా ఉందా అని డిమాండ్ చేశారు.  ఎందుకంటే మీకు రావాల్చిన ముడుపులు,లావాదేవీలు ఎప్పుడో అందిపోయి,జరిగిపోయి ఉంటాయి. మేము విద్యార్థి సంగాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకనైనా ఏవైతే ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పరిమితంకు మించి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయో వాటిపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీచేయాలని విద్యార్థి సంగాలుగా డిమాండ్ చేశారు.లేకుంటే రాబోవు రోజులలో తీవ్రమైనపరిణామాలు మీతోపాటు మీకు ముడుపు అందించిన విద్యాసంస్థలకూడా ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PDSU సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు, కార్యదర్శి వరప్రసాద్, అనిల్,గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అధ్యక్షులు,కార్యదర్శి చక్రపాణి, గురవయ్య అలాగే SFI నాయకులు:-నాగరాజు విద్యార్ధులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget