నూతన సంవత్సరం సందర్భంగా అమ్మణ్ణిని దర్శించుకున్న MP ,MLA దంపతులు.
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట కాల్లంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు, తమిళ ఆరాధ్యదైవం, భక్తుల కొంగుబంగారం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి తల్లిని నూతన సంవత్సరం సందర్భముగా MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు,స్థానిక MLA దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి,ఆలయ కార్యానివాహక అధికారి ఆళ్ళ శ్రీనివాసులురెడ్డి స్వాగతం పలికి అమ్మణ్ణి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా వేమిరెడ్డి దంపతులను MLA కిలివేటి సంజీవయ్య శాలువ కప్పి సన్మానించారు.అనంతరం MLA సంజీవయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం లో ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ,పట్టణ వైసీపీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి,మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు గోగుల తిరుపాల్, ముంగర అమరావతి, కౌన్సిలర్ పముజుల విజయలక్ష్మి ,వైసీపీ నేతలు పెమ్మారెడ్డి త్రిలోక్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment