వెంకటేశ్వరా వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన JSAAP 10 వ వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఎంపీ గురుమూర్తి గారు.
జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ వారి పదవ వార్షికోత్సవ సమావేశంలో తిరుపతి శాసనసభ్యులు శ్రీ కరుణాకర రెడ్డి, తిరుపతి ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు గారితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రసంగించిన ఎంపీ గురుమూర్తి గారు ఈ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని ఎవరికైనా సెలవు ఉంటుంది కాని జర్నలిస్ట్ మిత్రులకి మాత్రం సెలవు అనేది ఉండదని రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఈ సంఘటన జరిగినా క్షణంలో ప్రజల ముందుకు తీసుకొస్తారని అలాంటి జర్నలిస్ట్ లకి ఆటవిడుపు ఉండాలని వారికి రకరకాల ఎన్నో ఒత్తిడులు ఉంటాయి వాటినుంచి మానసికంగా దృడంగా ఉండేందుకు, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని తెలియజేసారు, జర్నలిస్టుల కోసం క్రీడలు నిర్వహించడంలో JSAAP ది గొప్ప పాత్ర అని అందునా ఈ క్రీడా వేదికను తిరుపతిగా ఎన్నుకోవడం అభినందనీయం అని JSAAP మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అందుకోసం మా వంతు కృషి చేస్తామని తెలియజేసారు ఈ సందర్బంగా శ్రీ గురుమూర్తి గారిని JSAPP కార్యవర్గం ఎంపీ గురుమూర్తిని ఘనంగా సత్కరించి మెమెంటోను అందజేశారు..
జర్నలిస్ట్ మిత్రుల మధ్య ప్రారంభోత్సవ మ్యాచ్ లో శాసనసభ్యులు బౌలింగ్ చేయగా ఎంపీ గారు బ్యాటింగ్ చేసి జర్నలిస్ట్ లను వీక్షకులను ఉత్సాహ పరిచారు, తదుపరి రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంపీ గారు ఫస్ట్ డౌన్లో దిగి బ్యాటింగ్ చేశారు.
Post a Comment