ఫీజులు* *కట్టకపోతే* *పిల్లలకు* *ఇంత* *అవమానమా*

*ఫీజులు* *కట్టకపోతే* *పిల్లలకు* *ఇంత* *అవమానమా* ...?

 *సూళ్లూరుపేటలో* *నారాయణ* , శ్రీ *చైతన్య* *బడా* *కార్పొరేట్* *పాఠశాల* *తీరు* 

 నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేటలో బడా కార్పొరేట్ పాఠశాలలు  తమ పిల్లల హక్కులను కించపరుస్తూ  అవమాన పరుస్తున్నారు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణంలో  తమ ఆవేదన వ్యక్తం చేశారు.

 ఫీజులు చెల్లించకపోవడంతో అభం శుభం తెలియని విద్యార్థులను స్కూల్ యాజమాన్యం సాటి విద్యార్థులతో కాకుండా ప్రక్కనే నేల పై కూర్చుని పెట్టడం, 
స్కూల్ ఆవరణంలో విద్యార్థుల మధ్య ఫీజులు చెల్లించ లేదంటూ హేళనగా మాట్లాడటం,
పిల్లల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంతో 
స్కూల్లో తమ పిల్లలకు విద్యాబోధనల కన్నా ఫీజులు పై ఒత్తిడి తీసుకురావడం 
వంటి పాఠశాల సిబ్బంది ధోరణితో  తాము తీవ్ర సంక్షోభాన్ని గురవుతున్న మన్నారు.
గత సంవత్సరం కరోనా కారణంగా కేవలం ఆన్లైన్ క్లాసులు జరుగాయని,  
ఫీజులు చెల్లింపు క్రమంలో కొంత ఆలస్యం కావడం  సంబంధిత ఫీజులను  రాయితీలను కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించి ఉన్న ఆ నిబంధనను కార్పొరేట్ పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయి.

 విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులను గత సంవత్సరమునకు చెల్లుబాటు చేసుకుని, వెంటనే ప్రస్తుత
 విద్య సంవత్సరానికి ఫీజులు చెల్లించ లేదంటూ బలవంతపు వసూళ్లకు  పూనుకుంటున్నారు.

కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఈ తరహాపాఠశాల నిర్వాహకులు వ్యవహార ధోరణి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన ఫీజుల విధానాన్ని పక్కనపెట్టి తమ ఇష్టారాజ్యంగా వేలకు వేలు రూపాయలు ఫీజులను బలవంతపు వసూళ్లకు పూనుకుంటున్నారని తమకు కొంత సమయాన్ని కేటాయిస్తే ఫీజుల చెల్లింపులు చేస్తామని తమ గోడును మీడియా ముందు చెప్పుకున్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి, విద్యాశాఖ అధికారులు, విద్యార్థి సంఘాలు  స్థానిక బడా కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య పాఠశాలల బలవంతపు ఫీజులు వస్తువులకు స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget