అస్తవ్యస్తంగా ఉన్న గూడూరు పురపాలక సంఘ ఓటర్ల జాబితాను సరి చేయాలని కమిషనర్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు
03-01-2022 సోమవారం నాడు గ్రీవెన్స్ డే సందర్భంగా గూడూరు పురపాలక సంఘ కార్యాలయం లో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ని కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు పురపాలక సంఘం ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా ఉందని ఒక వార్డు ఓట్లు ఇంకొక వార్డులో వందల సంఖ్యలో చేరి ఉన్నాయని, ఇదే జాబితా తో ఎన్నికలు నిర్వహిస్తే, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు వార్డులోని ఓటర్లను కనుగొనడం చాలా ఇబ్బంది కరమని పోటీ చేసే అభ్యర్ధులకు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రచారం చేయడం కూడా చాలా కష్టమని ఓటర్ల జాబితాలో కొత్తగా విభజించిన వార్డు యొక్క హద్దులను తెలుపుతూ వార్డు మ్యాప్ చూపించలేదని, వార్డు జాబితాలో ఏ డోర్ నెంబర్ నుండి ఏ డోర్ నెంబర్ వరకు ఓటర్లు ఉంటారో చూపించలేదని , ఏ ఏ ప్రాంతాలు వస్తాయో చూపించలేదని, ఓటర్ల జాబితాలో వార్డు కు సంబంధం లేని పోలింగ్ స్టేషన్లలోని ఓటర్లను చేర్చారని, కనుక వార్డు మ్యాప్, డోర్ నెంబర్ లు , ప్రాంతాలు, అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ల తదితర వివరాలతో కూడిన మెరుగైన ఓటరు జాబితాను రూపొందించి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నరసింహులు, జిల్లా బీసీ సెల్ నాయకులు పిల్లెళ్ళ శ్రీనివాసులు గూడూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ ఏసుపాక పెంచలయ్య గూడూరు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బట్టేపాటి కృష్ణయ్య, గూడూరు పట్టణ బీసీ సెల్ కన్వీనర్ రావుల శివ ప్రసాద్ గౌడ్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post a Comment