టీటీడీకి కేంద్రం షాక్ ఇచ్చింది..!
టీటీడీకి ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్ రెన్యువల్ కాలేదు. దీంతో విదేశీ విరాళాల సేకరణకు టీటీడీకి బ్రేక్ పడింది. చ్ఛంద,మత పరమైన సంస్థలకు విదేశీ విరాళాల వసూళ్లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఏ) లైసెన్స్ తప్పనిసరి. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ ఐదేళ్ల పాటు కొనసాగనుంది. ఈ కాల పరిమితి... 2020 డిసెంబర్ నాటికి టీటీడీ లైసెన్స్ గడువు ముగిసింది. లైసెన్స్ రెన్యువల్ కోసం ఏడాదిగా టీటీడీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 నాటికి 18,778 సంస్థలకు లైసెన్స్ గడువు ముగిసింది. 12,989 సంస్థలు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 5,789 సంస్థలు దరఖాస్తు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2020 -21 ఏడాదిలో టీటీడీకీ విదేశీ విరాళాలు ఒక్క రూపాయి కూడా అందలేదు. గతంలో టీటీడీకి పెద్ద సంఖ్యలో విదేశీ భక్తుల నుంచి విరాళాలు వచ్చేవి. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ప్రస్తుతం టీటీడీకి విదేశీ విరాళాల సేకరణకు పర్మిషన్ లేదు..
Post a Comment