మానవత్వం చాటుకున్న వార్డు వాలంటీర్లు
సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలోని మన్నార్ పోలూరు, న్యూ కాలనీ సచివాలయానికి చెందిన చల్లా చెంచమ్మ గత 20 రోజులుగా వెన్నుపూస ఆపరేషన్ చేసుకుని తడ లోని తమ కూతురు దగ్గర ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచానికి పరిమితమై తిరగలేని పరిస్థితి ఆమెది. ఈ విషయం తెలుసుకున్న న్యూ కాలనీ సచివాలయానికి చెందిన వెల్ఫేర్ సెక్రటరీ కృష్ణ ఆ క్లస్టర్ కు సంబంధించిన వాలెంటర్ ఐ. రమాదేవి ని తడకు పంపి వైయస్సార్ పెన్షన్2500 రూపాయలను ఆమెకు అందించడం జరిగింది. తమకున్న కొంతలో మరొకరికి సాయపడాలని సహృదయులైన వాలంటీర్లకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Post a Comment