గొట్టిప్రోలు లో కబడ్డీ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన డాక్టర్ పరసా.రత్నం
నెల్లూరుజిల్లా. నాయుడుపేట:- మండలంలోని గొట్టిప్రోలు గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా మాజీమంత్రి, టీడీపి ఉపాధ్యక్షులు డాక్టర్ పరసా.వెంకట రత్నం తన తల్లిదండ్రులైన పరసా పండయ్య,రోశమ్మ జ్ఞాపకర్ధం నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ ను మంగళవారం కస్తూరి ఫౌండేషన్ ఫౌండర్ పరసా శాలిని రత్నం తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఏటా తన ఆధ్వర్యంలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ ను ఈ సంవత్సరం కస్తూరి ఫౌండేషన్ వారు నిర్వహించడం అభినందనీయం అన్నారు.గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలు శారీరక,మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.నెల్లూరు, చిత్తూరు,ఒంగోలు జిల్లాల నుండి సుమారు 45 టీములు కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతి గా రూ 50 వేలు,ద్వితీయ బహుమతి గా రూ 30 వేలు,తృతీయ బహుమతిగా రూ 20 వేలు అందజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు పల్లమాల రామిరెడ్డి,నాయకులు ఎగుదాల విజయ కుమార్,పరసా రమణయ్య, కస్తూరి ఫౌండేషన్ సభ్యులు ముప్పాళ్ల.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment