అకాల వర్షాలు- ఆందోళనలో రైతులు కరోనా సమయాల్లో అకాల వర్షాలు బయన్దోళనలో ప్రజలు ప్రజల పై పగ పట్టినట్లు ప్రకృతి వైపరీత్యాలు చలిగాలులు, కరోనా, ఓమిక్రాన్, అకాల వర్షాలు
గత రెండురోజుల నుండి వాతావరణం లో మార్పులు రావడంతో ఆదివారం రాత్రి నుండి అకాల వర్షం కురుస్తోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉరుములు మెరువులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది. ఈ అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు ఖరీఫ్ సీజన్‌లో పంట చేతికి వచ్చే సమయంలో అత్యధిక శాతం వర్షాలతో పంట దిగుబడి లేక నష్టపోతే ఈ రబీ సీజన్‌లో సైతం ఈ అకాల వర్షాలు అన్నదాతలను వదిలిపెట్టడం లేదంటూ చేతికొచ్చే మొక్క జొన్న, వేరుశనగ పంటలు కోతకు, పూతకు రావడంతో వర్షాలతో పూత రాలిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలకు ఈ అకాల వర్షాలతో తెగుళ్లు వచ్చి పాడయ్యే అవకాశముందని ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు రోడ్లు అన్ని బురదమయం గా మరిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు, ప్రభుత్వ కార్యాలయాలల్లో ని ఆవరణలో కూడా నీరు నిలిచిపోవడంతో అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Post a Comment