సూళ్లూరుపేట మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పర్యటన.
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
మండలంలోని అబాక, కోటపోలూరు సచివాలయాన్ని మరియు గ్రోమోర్, జువారి ఎరువుల దుకాణాలను జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నేడు తనిఖీలు చేశారు. అనంతరం సచివాలయం సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రతి పేదవారికి అందే విధంగా చూడాలని సూచనలిచ్చారు. అనంతరం పట్టణంలో ఉన్న గ్రోమోర్ మరియు జువారి ఎరువుల షాపులను తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాలకు సిబ్బందికి రైతులకు ఎరువులను సకాలంలో అందించాలని సూచనలు ఇచ్చారు. ఎరువులు (యూరియా) కొరత ఉండటంతో ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని అందుకుగాను ఆధార్ కార్డు నమోదు చేసుకొని రైతులకు ఉన్నటువంటి పొలం ఆధారంగా ఎరువులను అందజేయాలని ఎరువులను అధిక రేట్లకు వ్యతిరేకిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట తాసిల్దార్ కె రవి కుమార్ వ్యవసాయ శాఖ ఏడి రాజ్ కుమార్,ఏవో కవిత మరియు పలు శాఖల అధికారులు ఉన్నారు.
Post a Comment