పథకాలు ఏమో కొందరికి,పన్నులు మాత్రం అందరికి



 జగన్ పాలనలో జనం బాధలు వర్ణనాతీతం

పథకాలు ఏమో కొందరికి,పన్నులు మాత్రం అందరికి

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు

తెలుగుదేశం హయంలో ఇస్తున్న పండుగ కానుకలు రద్దు చేసి పేద వాడికి పండుగ కూడా లేకుండా చేశారు.

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదవాడు సైతం పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో  చంద్రబాబు నాయుడు గారు పండుగ కానుకలు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా రద్దు చేశారు. గతములో కుటుంభ లో ఎంతమంది ఉన్నా 20 కేజీలు బియ్యం ఇస్తుండగా ప్రతి పేదవాడికి కనీస అవసరాలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు గారు కుటుంభం లో ఎంత మంది ఉంటే అంతమందికి 5 కేజీలు చొప్పున ఇచ్చారు.అదేవిధంగా రేషన్ షాపుల్లో సబ్సిడీ ధర పై నిత్యావసర వస్తువుల అందించగా జగన్మోహన్ రెడ్డి వాటి ధరలు కూడా పెంచారు. పేదలకు పెట్టేడు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు మూసివేశారు గతములో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా నిత్యం సమీక్షలు చేసి ధరలను అదుపు చేశారు.ఎక్కడైనా కొన్ని వస్తువుల కొరత ఏర్పడితే వెంటనే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసి ధరల పెరగకుండా చేశారు నేడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు గురించి సమీక్ష చేసిన పాపాన పోలేదు. అసలకు పౌర సరఫరాల శాఖా మంత్రికి బూతులు తిట్టడము తప్ప ఆ శాఖ గురించి ఏమి తెలియదు. నిత్యావసర వస్తువుల ధరలు గురించి సమీక్ష చేసి ధరలను అదుపులో ఉంచుట కొరకు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రాజకీయ పార్టీల సభ్యులతో కూడిన ఆహార సలహా సంఘాలు ఉండేవి.ఇవి ప్రతి మూడు నెలలకోకసారి సమావేశం అయ్యి ఆ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పై సమీక్ష చేసేవి. వైసీపీ ప్రభుత్వంలో వీటినికూడా నీయమించ లేదు. వైసీపీ ప్రభుత్వంలో పథకాలు ఏమో కొందరికి, పన్నులు ఏమో అందరికి వేస్తున్నారు.ఈ రెండన్నర సంవత్సరాల వైసీపీ పాలనలో కరెంట్, బస్సు,చార్జీలు పెంచారు.పెట్రోలు,డీజల్,గ్యాస్ ధరలు పెంచారు.రిజిస్ట్రేషన్ చార్జీలు,వృత్తి పన్నులు పెంచారు.చెత్తను సైతం వదలకుండా పన్ను వేస్తున్నారు.మద్యం ధరలు పెంచారు. ప్రభుత్వం విధించిన పన్నులు కారణంగా పేద,మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్ తల్లక్రిందులైంది. గతములో ఒక  కుటుంబానికి నెలకు రూ. 10 వేలు ఖర్చు అయితే నేడు రూ 16 నుండి రూ.17 వేల వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. గన్ పాలనలో జనం పడితున్న బాధలు వర్ణనాతీతం .పెరిగిన పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు వలన ప్రజలు పండుగలు కూడా చేసుకొనే పరిస్థితి లేదు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11 వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలిని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నదుల రవికుమార్, కలికి సత్యనారాయణ రెడ్డి.జక్కంరెడ్డి భాస్కర్ రెడ్డి,బుధవరపు శివకుమార్,ఇంటూరు విజయ్ మారుబోయిన వెంకటేశ్వర్లు,కె గోపాల్,SK నాసీర్, సజ్జా అశోక్,వల్లెపు సురేష్,చల్లా సూర్య,గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget