చెట్లను సంరక్షించడమనేది సంస్కృతిగా మారాలి డియస్పీ దేవరకొండ ప్రసాద్

 చెట్లను సంరక్షించడమనేది సంస్కృతిగా మారాలి
                                            డియస్పీ దేవరకొండ ప్రసాద్


   శ్రీ పొట్టి శ్రీరాములు  నెల్లూరు జిల్లా

 కావలి డియస్పీ "దేవరకొండ ప్రసాద్" కు "డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్" ప్రమోషన్ సందర్భంగా తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కె.తిరుపాలు, రాష్ట్ర సెక్రటరీ టి.శేషయ్య, ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ మానిటరింగ్ వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ చేవూరుచిన్న మర్యాదపూర్వకంగా ఆయనకు మామిడి,నిమ్మ మొక్కలు ఆయన చేతులమీదుగా డియస్పీ ప్రాంగణంలో నాటడం జరిగింది   ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర  అధ్యక్షులు కె.తిరుపాలు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో  శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని  డియస్పీ దేవరకొండ ప్రసాద్ కావలిలో బాధ్యతలు తీసుకున్న నుండి డివిజన్ లో శాంతిభద్రతల ప్రతిష్టాత్మకంగా అమలు చేశారని అన్నారు  ఈ సందర్భంగా డియస్పీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ చెట్లను సంరక్షించడమనేది సంస్కృతిగా మారాలని రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటి సంరక్షించాలని, ఆంధ్రప్రదేశ్‌ను పచ్చదనంతో కూడిన రాష్ట్రంగా మార్చే బాధ్యతను మనమే తీసుకోవాలని ఆయన అన్నారు  ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర సెక్రటరీ టి.శేషయ్య మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సంఘవిద్రోహా శక్తులను అణిచివేయడంలో పోలీసులు చేస్తున్న కృషిని గొప్పదన్నారు   పై కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ మానిటరింగ్ వర్కింగ్ అధ్యక్షులు "డాక్టర్ చేవూరుచిన్న" మాట్లాడుతూ "డియస్పీ దేవరకొండ ప్రసాద్" కరోనా మహమ్మారి విజృంభించి ప్రజలను భయంతో వణికిస్తున్న సమయంలో ఎంతో చాకచక్యంతో ఉన్నతాధికారులతో కలిసి శాంతిభద్రతల అమలుచేస్తూ ప్రజలకు ధైర్యాన్ని కల్పించారు,అదేవిదంగా తిరునాళ్ళను,గ్రామోత్సవాలను కట్టుదిట్టమైన భద్రతతో పర్యవేక్షిస్తూ విజయవంతంగా కార్యక్రమాలను ఘనవిజయంగా జరిగించటలో కృషి చేశారని  అని తెలిపేరు 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget