సోమవారం రాత్రి నుండి కర్ఫ్యూ అమలు. జిల్లాలో భారీగా పెరుగుతున్న కేసులు ముందస్తు చర్యల్లో భాగంగా కావలి పట్టణంలో సోమవారం నుండి కర్ఫ్యూ అమలు చేపట్టినట్టు కావలి నియోజకవర్గం ( DSP) దేవరకొండ ప్రసాద్ వెల్లడించారు. కరోనా మహమ్మారి మూడో విడతగా ఒమిక్రాన్ రూపంలో వస్తున్నందున ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. DSP దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ కావలిలో తిరిగే ప్రతి ఒక్కరూ, వ్యాపారస్తులు మరియు రోజువారి కూలీలు, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని,జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
Post a Comment