వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఐక్య పోరాటం...
నెల్లూరు నగరంలో ఆస్తుల పరిరక్షణకు ముస్లిం మైనారిటీ సంఘాలన్నీ ఐక్య పోరాటానికి శ్రీకారం చుట్టాయి.ముస్లిం మైనారిటీ వక్ఫ్ ఆస్తుల హక్కుల పరిరక్షణ కమిటీ పేరుతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముస్లిం మత ముఫ్తి ఇలియాజ్ నాయకత్వం వహించారు.వివిధ రాజకీయ పార్టీలో ఉంటూ నిన్నటి వరకు విభిన్న ధ్రువాలు గా ఉన్నవారు సైతం ఒక్క తాటిపైకి వచ్చారు..ఆస్తుల పరిరక్షణ కోసం పని చేయాలని నిర్ణయించారు రాజకీయ పరిశీలకులు కూడా విస్తుపోయేలా ముస్లిం మైనార్టీ నేతలు అందరూ కూడా తమ వద్ద ఉన్న చిన్నపాటి విభేదాలు మరచి ఒక్కతాటిపై నిలిచి వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం నినదించారు.నెల్లూరు నగర మునిసిపల్ కమిషనర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. నెల్లూరు నగర నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో కమిషనర్ పై ఫిర్యాదు చేసిన ముస్లిం మైనార్టీ నేతలు ముస్లింలపై మునిసిపల్ కమిషనర్ విద్వేషం చిమ్ముతున్నారని బారాషహీద్ దర్గా లో కనీసం పారిశుద్ధ్యం కూడా చేయించరని ఎక్కడా చూడలేదని ముస్లిం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ వ్యవహార తీరు, తదితర అంశాలపై సిఐ దృష్టికి తీసుకువచ్చారు. గురువారం లోపు న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోకపోతే శుక్రవారం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు...
Post a Comment