కాకాణి చేతులు మీదుగా గిరిజనులకు మొబైల్ ఆధార్ కేంద్రం ప్రారంభం"
తేది:10-01-2022
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కసుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన కాలనీలో మొబైల్ ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గిరిజనుల పిల్లలకు అందజేస్తున్న పోషకాహార వివరాలను ఆరా తీసిన ఎమ్మెల్యే కాకాణి.
కసుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి, వరి సాగుకు అందిస్తున్న సాగునీరు, ఎరువుల పంపిణి తదితర విషయాలపై సమీక్షించి, రైతులతో చర్చించిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా, గిరిజనులు ఆధార్ నమోదు చేసుకోక, ఆధార్ లేనందున లబ్ధి పొందలేకపోతున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో ఆధార్ కార్డులేని నిరుపేద గిరిజనులను గుర్తించి, కాలనీల్లోనే ఎక్కడికక్కడ మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆధార్ కార్డులు అందజేస్తున్నాం.
👉అమాయకులైన పేద గిరిజనులు ప్రభుత్వ పథకాలుల పట్ల అవగాహన లేక, తమ రెక్కల కష్టంతో జీవిస్తూ, ఆధార్ అవశ్యకతను గుర్తించక, ఆధార్ నమోదు ప్రక్రియకు దూరమవుతున్నారు.
👉 గిరిజనుల పేదరికాన్ని గుర్తించి, వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో, ఆధార్, రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేసి, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తాం.
👉 గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, నూతన ఇళ్లు మంజూరు చేయించి, వాటిని మేమే నిర్మించిస్తాం.
👉 గిరిజనులకు చెందిన పాత ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మించేందుకు నూతనంగా ఇళ్లు మంజూరు చేసి, నిర్మించి ఇస్తాం.
👉 గిరిజనుల పిల్లలకు అంగన్వాడీ ద్వారా సరుకులు అందించడంతోపాటు, స్కూళ్లకు పంపించి చదివించేందుకు చర్యలు తీసుకుంటాం.
👉 అమాయకులైన పేద గిరిజనులకు ప్రత్యేకించి, చల్లా యానాదుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలిచి, ఆదుకుంటాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించడంతో పాటు, అవసరమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నాం.
👉 దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఉన్నా, రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే ఎరువుల పంపిణీ చేపడుతున్నాం.
👉 రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడటంతోపాటు, గిట్టుబాటు ధర కల్పించేందుకు, నిరంతరం పర్యవేక్షిస్తూ, నిత్యం అందుబాటులో ఉంటాం.
Post a Comment