కొత్త జిల్లాల తో సంపూర్ణ అభివృద్ధి. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.

 కొత్త జిల్లాల తో సంపూర్ణ అభివృద్ధి. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.






 నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-


 రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం, సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అవుతాయని సులూరుపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. పట్టణంలోని శనివారం ఆర్. అండ్. బి. అతిథి గృహం నుండి వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళలు ఆధ్వర్యంలో ర్యాలీగా పుర వీధుల్లో తిరిగి ప్రజలకు అభినందనలు తెలిపారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల రెట్టింపు కావడంతో ఆయా జిల్లాల్లో విస్తీర్ణం తగ్గడంతోపాటు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటై అధికారుల నియామకం జరిగి అన్నీ జిల్లాలు మంచి అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేస్తాయని, అంతేకాకుండా ప్రజలకు అనువుగా జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో ప్రజలు తమ పనులను సులభంగా చేసుకోగలరని,  శ్రీ బాలాజీ జిల్లా రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతేకాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి పథకంలో బాలాజీ జిల్లా ముందుంటుందని కొనియాడారు .ఈ ప్రాంతంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండడం సంతోషదాయక మన్నారు. అలాగే  పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రం, భీముల వారి పాలెం ఓడరేవు, అంతర్జాతీయ విమానాశ్రయం,శ్రీసిటీ సేజ్, మాంబట్టు సెజ్,మేనకూరు సెజ్ లు ఉన్నాయని వీటితోపాటు దుగ్గరాజపట్నం పోర్టు కూడా ఏర్పాటు కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి,సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, తడ మండల అధ్యక్షుడు కొలివి రఘు, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు,నాటక మండలి చైర్మన్ కళాత్తూరు శేఖర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ ,చిన్న సత్యనారాయణ మరియు సర్పంచ్ లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget