స్థానిక పత్రికలకు అన్ని విధాలుగా సహకరిస్తాం

 స్థానిక పత్రికలకు అన్ని విధాలుగా సహకరిస్తాం

 కలెక్టర్ సహకారంతో స్థానిక పత్రికలకు యాడ్స్ మంజూరు చేశాం

 ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ పాటించాలి

పీరియడికల్స్ కు స్టేట్ పాస్ పై కలెక్టర్ దృష్టికి తీసుకెళతాం

 సమాచార, పౌర సంబంధాల శాఖ డీడీ వెంకటేశ్వర ప్రసాద్



సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా స్థానిక పత్రికలకు అన్ని విధాలుగా సహయ, సహకారాలు అందిస్తామని ఆ శాఖ ఉప సంచాలకులు ఎమ్. వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని రేబాల లక్ష్మీ నర్సారెడ్డి జూనియర్ ఏసీ  మందిరంలో‌ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్, కో - కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి, గట్టుపల్లి శివకుమార్ లు అధ్యక్షతన జరిగిన యూనియన్ రెండవ జిల్లా మహాసభకు ముఖ్య అథిదిగా నెల్లూరు జిల్లా ఉప సంచాలకులు, సీనియర్ సంపాదకులు  వేల్పుల శేష చలపతి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత ఏడాదిన్నరగా జర్నలిజం తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొనిందని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ సహకారంతో దరఖాస్తు చేసుకున్న అన్ని స్థానిక పత్రికలకు యాడ్స్ మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ పత్రికలను నడుపుకోవాలని సూచించారు. మాస, పక్ష, వార దినపత్రికల సంపాదకులకు స్టేట్ బస్ పాస్ మంజూరు చేయాలని పలువురు కోరారని, దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళతానని వెల్లడించారు. యూనియన్ రాష్ట్ర కన్వీనర్ మేకపాటి  మాల్యాద్రి నాయుడు, సీనియర్ సంపాదకులు వేల్పుల శేషాచల పతి, రాష్ట్ర కో - కన్వీనర్ గట్టుపల్లి శివకుమార్ లు మాట్లాడుతూ స్థానిక పత్రికల సంపాదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పత్రికలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ సంస్థల ద్వారా నడుస్తున్న దినపత్రికలకు అగ్రతాంబూలం వేస్తూ, స్థానిక పత్రికలపై  సవతి తల్లి ప్రేమ తగదన్నారు. స్థానిక పత్రికలను ఆదుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకుల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం ముందుగా కోవిడ్ ప్రారంభం నుంచి అసువులు బాసిన జర్నలిస్టులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. 

నూతన జిల్లా కమిటీ ఎన్నిక

జిల్లా మహాసభ అనంతరం నూతన జిల్లా కమిటీని రాష్ట్ర కన్వీనర్‌, కో- కన్వీనర్‌ లు ప్రకటించారు. 

జిల్లా అధ్యక్షులుగా ఉడతా రామకృష్ణ (సదా మీ కోసం పత్రిక సంపాదకులు), ప్రధాన కార్యదర్శిగా పిగిలం నాగేంద్ర (జనహుషార్ సంపాదకులు), వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెలసిరి కుమార్ (ధర్మక్షేత్రం సంపాదకులు), కోశాధికారిగా తుమ్మా రమేష్ (చదరంగం సంపాదకులు) నియమితులయ్యారు. 

ఉపాధ్యక్షులుగా సుంకర సుధాకర్, డీ వరప్రసాద్, చీదెళ్ల సరళ, పీ వెంకటరామిరెడ్డి, కే. ఉదయ్ కుమార్ రెడ్డి, చేవూరు చిన్నాలు నియమితులయ్యారు. 

సహాయ కార్యదర్శులుగా వీ. మధుసూదన రావు, షేక్ అలీ, షేక్ రిజ్వాన్, ఎస్. కామేశ్వరరావు, కూచి వెంకట సురేష్, సయ్యద్ సలీమ్, ఆవుల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పీ. చక్రధర్, రాశిరాజు శారధ, సీహెచ్ శివ, షేక్ జావీద్, కూరాకు గోపీ, షేక్ జకావుల్లా, మావిళ్ల ఆనంద్ నియమితులయ్యారు. 

గౌరవ సలహాదారులుగా కోట సునీల్ కుమార్, గూండాల ప్రాతాప్ రెడ్డి, చప్పిడి తిరుమలేష్, న్యాయ సలహాదారులుగా మద్దిబోయిన సుందరయ్య యాదవ్ లు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ కార్యక్రమం లో యూనియన్ రాష్ట్ర, జిల్లా  నాయకులు  శరత్ యాదవ్, రమేష్ రెడ్డి,,, ఎస్.డి. జావీద్, చిత్తూరు జిల్లా నాయకులు రాజా రెడ్డి, ఒంగోలు జిల్లా అధ్యక్షురాలు మల్లేశ్వరి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget