కాకాణి ఇక నీ ఆట‌లు సాగ‌వ్‌... టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర

 కాకాణి ఇక నీ ఆట‌లు సాగ‌వ్‌... 


 అధికార అండ‌తో మా పార్టీ నాయ‌కుల పై దాడుల‌కు పాల్ప‌డితే త‌గిన బుద్దిచెబుతాం 


 *దొంగ‌ల‌ను ప‌ట్టుకోవ‌డం మానేసిన పోలీసులు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల పై దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారు. 


 ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం సిగ్గుచేటు. 


 అధికారులు చ‌ట్ట‌వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. 


 అధికారులంటే మాకెంతో గౌరం ఉంది...హుందాగా వ్య‌హ‌రించండి. 


 చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సర్వేపల్లి నియోజక వర్గంలోని పోలీసులు,అధికారులు, వై.సి.పి  నాయకులు పై జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు 


 నెల్లూరులోని జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర 


 బొమ్మి సురేంద్ర కామెంట్స్... 






వైసిపి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎంఎల్ఏ కాకాణి ప్రోధ్బ‌లంతో స‌ర్వేప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల పై దౌర్జ‌న్యం మితిమీరి పోయింది.


పోలీసులు సైతం న్యాయం,ధ‌ర్మం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధ‌ర్మ‌మైన స‌రే... వైపిపి నాయ‌కుల‌ను ర‌క్షిస్తూ మా నాయ‌కులు,కార్య‌క‌ర్త‌ల పై దాడులు,దౌర్జ‌న్యాలు కు పాల్ప‌డుతున్నారు.


ఇప్ప‌టి వ‌ర‌కు ఓపిక‌తో భరిం చాం...ఇక భరించే ప్ర‌స‌క్తే లేదు.ఖ‌చ్చితంగా తిరుగు బాటు చేసి త‌గిన గుణ‌పాఠం చెబుతాం.


ఎంఎల్ఏ కాకాణి క‌ళ్ళ‌ల్లో ఆనందం చూడాల‌న్న ఉదేశంతో పొద‌ల‌కూరులో ఎస్ఐ క‌రిముల్లా మా మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు పై దాడికి పాల్ప‌డి ఆయ‌న స‌తీమ‌ణిని సైతం అస‌భ్య‌ప‌ద‌జాలంతో దుర్భాష‌లాడాడు.


ఎంఎల్ఏ కాకాణి చేసిన అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన మా నాయ‌కుడు పై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ‌డం సిగ్గుచేటు.ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం.


వైసిపి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వ‌త మా నాయ‌కుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి పై అక్ర‌మ‌కేసులు బ‌నాయించారు...


అభివృద్ది...అభివృద్ది అంటూ డ‌ప్పు కొట్టుకుంటూ...ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్ప చేసిందేమి లేదు.


కాకాణికి ద‌మ్ముంటే టిడిపి అధికారంలో ఉన్నస‌మ‌యంలో మా నాయ‌కులు సోమిరెడ్డి స‌హ‌కారంతో స‌ర్వేప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ది...వైసిపి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వ‌త చేసిన అభివృద్ది లెక్క‌లు బ‌య‌ట‌పెట్టాలి.


ఎరువులు కొర‌త ఉన్నా స‌ర్వేప‌ల్లి నిమోజ‌క వ‌ర్గంలో లేదంటూ ప్ర‌చారం చేసుకుంటున్న ఎమ్మెల్యే కాకాణి...ఆ విష‌యంలో త‌మ ప్ర‌భుత్వంతో పాటు జిల్లాలోని మిగిలిన మంత్రులు,ఎమ్మెల్యేల‌ను అస‌మ‌ర్దులుగా చూపుతున్నాడు.  


ఎమ్మెల్యే కాకాణి ఆదేశాల‌తో గ‌త తాసిల్దార్ స్వాతి చేసిన అవినీతి అక్ర‌మాల‌ను వెలికి తీశాడ‌న్న నెపంతోనే పొద‌ల‌కూరు టిడిపి నాయ‌కుడు మ‌స్తాన్‌బాబు పై పోలీసుల‌తో దాడి చేయించాడు.


అప్ప‌టి నుంచి మ‌స్తాన్‌బాబు పై క‌క్ష క‌ట్టిన ఎమ్మెల్యే కాకాణి పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని మా నాయ‌కుడు పై దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నాడు.


సర్వేప‌ల్లి నియోజ‌క‌ వ‌ర్గంలో మా నాయ‌కుడు నాగేంద్ర ప్ర‌సాద్‌కు సంబందించిన ఆస్తుల‌ను ధ్వంసం చేశారు.శ్రీ‌నివాస యాదవ్ కు సంబందించిన పొలాల్లో కాలువ‌లు త‌వ్వించి న‌ష్ట‌ప‌రిచాడు.కోడూరులో గంగాధ‌ర్ అనే వ్య‌క్తి సంబందించిన రొయ్య‌ల గుంత‌ల‌ను  విధ్వంసం చేసి కోట్ల రూపాయ‌లు న‌ష్టం క‌లిగించాడు.


ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం సిగ్గుచేటు.


స‌ర్వేప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేసిన ఎమ్మెల్యేలు ఎంతో హుందాత‌నంగా ప‌నిచేస్తే కాకాణి మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

పోలీసుల‌తో పాటు ఎంఆర్ఓ...ఎంపిడిఓల నుంచి కింద స్దాయి అధికారుల వ‌ర‌కు ఎమ్మెల్యే కాకాణి ఆదేశాల‌తో చ‌ట్ట వ్యతిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పరిస్థితి ఇలానే కొన‌సాగితే త‌గిన గుణ‌పాఠం చెబుతాం.


అదికారులంటే మాకెంతో గౌరం ఉంది...ఎమ్మెల్యే చెప్పిన‌ట్లు ఆడ‌టం కాకుండా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌ని కోరుతున్నాం.

దొంగ‌ల‌ను...దోపిడిగాళ్ళ‌ను ప‌ట్టుకోవ‌డం మానేసిన పోలీసులు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల పై దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌డం సిగ్గు చేటు


అధికారంలో ఎవ్వ‌రూ శాశ్వ‌తం కాదు...అది గుర్తుంచుకుని అధికారులు వ్య‌వ‌హ‌రించాలి...


చ‌ట్ట‌వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు.


ఇప్ప‌టి కైన జిల్లా ఉన్న‌తాధికారులు స్పందించి స‌ర్వేప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో జ‌రుగుతున్న అవినీతి,అక్ర‌మాలు,దౌర్జ‌న్యాలు,దాడుల‌కు అడ్డుక‌ట్ట వేయాలి.


సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు...చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న  పోలీసులు, వై. సి.పి నాయకులు పై ఫిర్యాదు చేసిన నియోజక…

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget