"కాకాణికి ఘనస్వాగతం పలికిన రైతులు"

 "కాకాణికి ఘనస్వాగతం పలికిన రైతులు"

బండేపల్లి చివరి ఆయకట్టుకు సమగ్రంగా సాగునీరు అందించారంటూ, రైతుల ప్రశంసలు.

రైతుల హర్షాతిరేకాల మధ్య కొనసాగిన కాకాణి పర్యటన.





శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కనుపూరు ప్రధాన కాలువ నుండి బండేపల్లి కాలువ ద్వారా చిట్ట చివరి ఆయకట్టుకు అందుతున్న సాగునీటి వివరాలను రైతులు, అధికారులను అడిగి తెలుసుకొని, సమీక్ష నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

 సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక సెంటు పొలానికి కూడా, ఇబ్బంది రానివ్వకుండా, సంపూర్ణంగా సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.  బండేపల్లి కాలువ ద్వారా చివరి ఆయకట్టు ప్రాంతానికి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి, గత మూడు సంవత్సరాలుగా సాగునీటి సమస్య లేకుండా చేశాం.  తెలుగుదేశం హయాంలో బండేపల్లి కాలువ పూర్తి  చేస్తానన్న అపర భగీరధుడు, మంజూరు ఉత్తర్వులు చేతిలో పెట్టి, ఒక్క రూపాయి నిధులు విడుదల చేయకుండా తప్పుకున్నాడు.  ఎన్నికల ముందు హడావుడిగా ప్రభుత్వ భూముల్లో బండేపల్లి కాలువ పనులు ప్రారంభించి, తాటిచెట్టంత పైలాన్ ను నిర్మించుకొని, సంబరపడి పోవడం తప్ప, రైతులను సంతోషం పెట్టలేకపోయాడు.  బండేపల్లి కాలువ నిర్మాణం పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే, ప్రతిపాదించిన కాలువ ప్రాంతానికి అడ్డంగా రైల్వే లైన్ నిర్మిస్తుంటే, ఆ ప్రాంతంలో బ్రిడ్జి కూడా మంజూరు చేయించ లేకపోయాడు.  బండేపల్లి కాలువ అనే అస్త్రాన్ని ఉపయోగించి, ఓట్లు దండుకోవాలనే స్వార్థ ప్రయోజనం తప్ప, రైతు శ్రేయస్సు గురించి ఆలోచన చేయలేదు.  బండేపల్లి కాలువ నిర్మాణం పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలోనే సమావేశం నిర్వహించి, ప్రధాన సమస్య అయిన భూసేకరణను పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో నీరు-చెట్టు పేరుతో రైతులను అడ్డుపెట్టుకొని దోచుకొని, ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఓటుకు 1500 రూపాయల నుండి 2000 రూపాయలు చెల్లించినా ఓటమిపాలయ్యాడు. ప్రజల్లో పరపతి కోల్పోయిన వారు, ప్రజల చీదరించుకొని, తరిమి కొట్టినా, మేము ప్రజల్లోనే ఉంటామంటూ, ప్రకటనలు గుప్పిస్తూ, ఆత్మస్తుతి -  పరనిందతో బ్రతుకుతున్నారు. ఎరువుల కొరత ఉన్నప్పటికీ, సర్వేపల్లి నియోజకవర్గంలో నిరంతరం సమీక్షిస్తూ, రైతులకు ఎటువంటి లోటు లేకుండా సకాలంలో ఎరువులు అందిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో, పాపం! కొంత మందికి కంటి మీద కునుకు పడటం లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ సమస్య వస్తుందో వెంటనే వాలిపోయి, శాసనసభ్యుని మీద విమర్శలు చేద్దామని కొంతమంది ప్రబుద్ధులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి సబ్సిడీ విత్తనాలు, సాగు నీరు, అవసరమైన ఎరువులు అందించడంతోపాటు, పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం. మంత్రులుగా వెలగబెట్టినవారు, మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి,రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, దోచుకున్న అవినీతిపరులు, రైతుల పట్ల కపట ప్రేమ ఒలకపోస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో, తెలుగుదేశం హయాంలో జరిగినట్టు విచ్చలవిడి అవినీతికి ఆస్కారం లేకుండా, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget