"గర్భిణీలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యము మరియు ఆరోగ్య ఆసరా"
నెల్లూరుజిల్లా. దొరవారిసత్రం:-
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు నాయుడుపేట డివిజన్ పరిధి ఆరోగ్యశ్రీ టీం లీడర్ నాగేంద్ర బూరగ దొరవారిసత్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రాలు మరియు ఆశావర్కర్ల తో సమావేశం నిర్వహించారు. అనంతరం నాగేంద్ర బూరగ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందరికీ ఆరోగ్యశ్రీ అనుసంధాన ప్రైవేట్ హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందించబడునని, అలాగే కొన్ని ప్రత్యేక చికిత్సలకు ఆరోగ్య ఆసరా కింద కొంత డబ్బును అందించబడునని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు డెలివరీ సమయంలో ఉచిత వైద్యం తో పాటు ఆసరా కింద రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు గర్భిణీ స్త్రీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేయబడునని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు తో పాటు బ్యాంకు పుస్తకం కూడా తప్పనిసరిగా తీసుకొని రావలెను తెలిపారు. నాయుడుపేట డివిజన్ పరిధిలో అర్హులై ఉండి కూడా కార్డు లేని వారిని గుర్తించి వెంటనే వాళ్ళకి ఆరోగ్య కార్డు మంజూరు చేయవలసిందిగా ఆరోగ్య మిత్రాలను ఆదేశించారు.
Post a Comment