జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా జరుగుచున్న పనులను మరియు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పధకం కింద నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులను పరిశీలించడంలో బాగంగా జిల్లాకు విచ్చేసిన నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్ సభ్యులు శ్రీ పి. సంతోష్, శ్రీమతి రీనా దేశాయి సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులు మరియు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పధకంలో భాగంగా నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనుల గురించి నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్ సభ్యులతో చర్చిండం జరిగింది. జిల్లాకు విచ్చేసిన నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్ సభ్యులు జిల్లాలోని 4 మండలాల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో జరుగుచున్న ఉపాధి హామీ పథకం మరియు పి.ఎం.జి.ఏ.వై పధకం ద్వారా జరుగుచున్న పనులను పరిశీలిస్తారు. వీరి వెంట డ్వామా పి.డి శ్రీ తిరుపతయ్య, హౌసింగ్ పి.డి శ్రీ వేణుగోపాల రావు పాల్గొన్నారు.
Post a Comment