నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-
సులూరుపేట పోలీస్ స్టేషన్ లో నేడు మండలంలోని సచివాలయంలో పనిచేస్తున్న మహిళ పోలీస్ లకు దిశా చట్టం, మహిళల భద్రత పై సూళ్లూరుపేట ఎస్.ఐ పి రవి బాబు పలు సూచనలు ఇచ్చారు.అనంతరం ఎసై మహిళలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల భద్రతకు ఎన్నో చట్టాలు అమలు చేశారని, ఆచట్టాల అన్నిటినీ మహిళలకు అందే విధంగా చూడాలనే ఉద్దేశ్యంతో నేడు జిల్లా ఎస్పీ సి.హెచ్ విజయ రావు ఆదేశాల మేరకు గూడూరు డి.ఎస్.పి రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో సులూరుపేట సి ఐ ఐ.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేడు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ పి.రబాబు తెలిపారు. సచివాలయ మహిళా పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరారు. మహిళల భద్రత లో ప్రధాన భాగస్వాములు అయినటువంటి సచివాలయ మహిళా పోలీసులు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గుట్కా విక్రయాలు, మద్యం బెల్ట్ విక్రయాలు, మహిళలపై వేధింపులు, పలు సమస్యలపై దృష్టి సారించి సచివాలయం వద్దనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. సచివాలయంలో వీలుకాని పక్షంలో వెంటనే 100 కు డైలు చేయాలని లేదా జిల్లా ఎస్పీ గాని, డీఎస్పీ గాని, సి ఐ కి గాని, ఎస్ ఐ కి గాని లేదా పోలీస్ స్టేషన్ కి గాని వెంటనే సమాచారం అందించాలని కోరారు. ముందుగా ఎసై సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.అనంతరం మహిళా పోలీసులు భవిష్యత్తులో కూడా మహిళల పట్ల తీసుకోవాల్సిన టువంటి భద్రతలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట పోలీసులు మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు.
Post a Comment