ఉపాధ్యాయుల అరెస్టు అప్రజాస్వామికం. ఏఐటియుసి,ఎస్ ఎఫ్ ఐ డిమాండ్.
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిన్న జిల్లాకలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వాలని బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసుల చేత ఎక్కడికక్కడ నిర్బంధించడం దారుణమని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఇలపా నాగేంద్రబాబు అన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ రివర్స్ పి ఆర్ సి ని వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను చిన్నాభిన్నం చేయడానికి ప్రభుత్వం పోలీసులు ఉసిగొల్పుతోందని, పిఆర్సి ద్వారా ప్రభుత్వం అటు ఉద్యోగుల తో పాటు ఇటు నిరుద్యోగులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ప్రభుత్వ నిరంకుశ వైఖరిని దుయ్యబట్టారు.
మాట తప్పను మడమ తిప్పనని బీరాలు పలికిన ముఖ్యమంత్రి నేడు పూర్తిగా యూటర్న్ తీసుకుని రాష్ట్ర భవితవ్యాన్ని అధోగతి పాలు చేస్తున్నాడన్నారు. తక్షణం సిపిఎస్ రద్దు చేయాలని, పాత పీఆర్సీని అమలు చేయాలని, ఉద్యోగుల వయో పరిమితిని తగ్గించాలని డిమాండ్ చేశారు. నిన్న తెల్లవారుజామున ప్రభుత్వ టీచర్లను ఉగ్రవాదుల కంటే దారుణంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఆఖరికి మహిళా టీచర్లను కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం ద్వారా ప్రభుత్వ దివాలాకోరుతనం అర్థమవుతోందని అన్నారు. ఉపాధ్యాయులు ధర్నా కు పూర్తి మద్దతు ఇస్తున్నామని, అరెస్టు చేసిన ఉపాధ్యాయులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు సూర్య లోకేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment