నిత్యవసర మరియు ఇoదనం ధరలు రోజు రోజుకి పెరిగిపోతుండడంతో నేడు సూళ్లూరుపేట లో ర్యాలీ, నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట:-
రాష్ర్టంలో రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర మరియు ఇంధన ధరలు తగ్గించాలని, ఇతర రాష్ట్రాతో పోలిస్తే మన రాష్ట్రంలో ధరలు అత్యధికంగా ఉన్న దృష్ట్యా జగన్ రెడ్డి ప్రభుత్వ వైకరికి నిరసనగా నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అదేశాలమేరకు టిడిపి కార్యాలయం నందు సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ నెలవల సుబ్రమణ్యం , తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ వేనాటి సతీష్ రెడ్డి , పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 6మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి తాసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సులూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రోజు రోజుకి నిత్యవసర వస్తువులు,ఇంధనం ధరలు పెరిగి పోతున్నాయని వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదే విధముగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలకు పండుగ కానుకగా చంద్రబాబు నాయుడు నిత్యవసర వస్తువులు ఇస్తూ ఉండేవారని ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి అధిక రేట్లు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో
Post a Comment