పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. సోమవారం పీఆర్సీపై మంత్రుల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.
‘ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. ఉద్యోగులను చర్చలకు పిలించాం. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని తెలిపారు.
Post a Comment