రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి నెల 9వ తేది నిర్వహించే పట్టణ కమిటీ సమావేశం రేపు అనగా తేది 09-01-22 ఆదివారం ఉ.10.00 గంటలకు కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించబడను. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కావలి.
2024 లో అంతిమ విజయం మనదే..
నెల్లూరు రూరల్ లో పచ్చ జెండా రెపరెపలాడిద్దాం
కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాఠాలు నేర్చుకుందాం
ఓటమి విజయానికి తొలి అడుగు
ప్రతి ఒక్కరు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
నూతన కమిటీలను వేసుకుని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ముందుకు వెళ్దాం
అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి
ఆదివారం జరగనున్న నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ ల టీడీపీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం లో భాగంగా, శనివారం నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు..
రేపు జరగబోవు కార్యక్రమం యొక్క అజెండాను, సంస్థాగత ఎన్నికల యొక్క ప్రక్రియ ను నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు వివరించి దిశా నిర్దేశం చేశారు. పై కార్యక్రమంలో పనబాక భూలక్ష్మి, Dr. ఊరందూరు సురేంద్ర బాబు, అనమాల దయాకర్ గౌడ్, కంటే వెంకట సాయి బాబా, జాఫర్ షరీఫ్, పెంచల్ నాయుడు, రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలే టిడిపి విజయానికి నాంది అని, ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలు ఉండాలనీ పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు బనాయించే అక్రమ కేసులకు భయపడవద్దని, నెల్లూరు రూరల్ లో వైసిపి నీటి బుడగ లాంటిదనీ అన్నారు. త్వరలోనే ఆ నీటి బుడగని పగలగొడదామని, పచ్చ జెండాను ఎగరేద్దాం అని అన్నారు. నెల్లూరు రూరల్ లో వైసీపీ నేతల అవినీతి సంపాదన ఎక్కువైపోయిందని,కార్పొరేషన్ ఎన్నికలే దీనికి ప్రత్యక్ష నిదర్శమనీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ నేతలు గెలిచే దమ్ము లేక దౌర్జన్యాలు, బెదిరింపులతో పాటు ఒక్కొ డివిజన్లో 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఖర్చు చేశారని వైసిపి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇదో గెలుపా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు...2024 సాధారణ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. విజయం సాధించడం అంటే ఆషామాషీ కాదని ప్రజాసమస్యలను ఒడిసి పట్టాలన్నారు..ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ తెలుగుదేశం కార్యకర్త నిలబడి పోరాటం చేయాలన్నారు. వైసీపీ నేతలు ఎన్ని బెదిరింపులు వచ్చిన దౌర్జన్యాలు చేసిన ఎవరు బెదరవద్దన్నారు తెలుగుదేశం పార్టీ తరపున తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోరాటాలు చేసామని ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులకు నేడు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అని సూటిగా ప్రశ్నించారు. ఇసుక దగ్గర్నుంచి ప్రతి దాంట్లో కోట్లు దండుకోవడమే వైసిపి నేతలకు నిత్యం దందావిమర్శలు సంధించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సమయంలో ఒంగి ఒంగి దండాలు పెట్టి సందు సందు తిరిగిన వైసిపి నేతలు, కార్పొరేటర్లు ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజా సమస్యలపై ఎక్కడా పనిచేయడం లేదని కనీసం వార్డుల్లో కూడా తిరగడం లేదని అబ్దుల్ అజీజ్ విమర్శలు ఎక్కుపెట్టారు. వైసిపి కార్పొరేటర్ల, నాయకుల నిజ నైజం ఇదేనని ప్రజలు వాస్తవాలు గమనించేలా వారిని చైతన్యం చేయాలన్నారుప్రజా చైతన్యంతోనే మార్పు వస్తుందన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలే తెలుగుదేశం పార్టీ విజయానికి నెల్లూరు జిల్లాలో నాంది పలుకుతుందని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.
నిత్యం ప్రజల్లో ఉందాం..పచ్చ జెండా ఎగుర వేద్దాం... అని అన్నారు..
రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు.. పేద ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆమీ తుమి తేల్చుకుందాం అన్నారు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేలా ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక నిర్ణయాలు చేసిందనీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ లు ఇప్పటికే ఆ పార్టీకి దూరమవుతున్నారు వారిని మరింత చైతన్యవంతం చేయాలనీ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎంత ఎండగడితే తెలుగుదేశం పార్టీ విజయానికి అన్ని అడుగులు పడ్డట్టు అని అన్నారు. వైసిపి నేతలు అధికార బలంతో విర్ర వీగవచ్చు.. కానీ ప్రశ్నించే వ్యక్తులను మనం... ప్రజా సమస్యలపై ఏ రోజైతే మనం ప్రశ్నింస్తామో... కలబడతామో.. ఆ రోజు మనం పచ్చజెండా ను ఎగరవేసినట్లే అని ధీమా వ్యక్తం చేశారు.
Post a Comment