13 లక్షల 75 వేల రూపాయలు కలిగిన 2 మినీ లారీలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సులూరుపేట ఎసై పి రవిబాబు, తడ ఎస్సై శ్రీనివాసులురెడ్డి.
నెల్లూరు జిల్లా తడ మండల పరిధిలోని గత నెల డిసెంబర్ 8వ తేదీన మాంబట్టు క్రాస్రోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కన TN 30 AH 7336 మినీ లారీ, పేరియవట్టు వద్ద జాతీయ రహదారి పక్కన ఆపివున్న TN18 AS 0821 లారీలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకుని వెళ్లిన విషయం తెలిసిందే. లారీ యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడంతో జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి సూచనలతో సూళ్లూరు పేట సిఐ వెంకటేశ్వర్లు రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా నెల రోజులకి రాత్రి సులూరుపేట ఎస్ ఐ పి.రవిబాబు తడ ఎస్సై శ్రీనివాసులు రెడ్డి తన సిబ్బందితో శ్రమించి దొంగతనాలకు పాల్పడిన వ్యక్తుల సమాచారం తెలుసుకొని తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఇద్దరు నిందితులు దొంగతనం పాల్పడినట్టు తెలపగా వెంటనే రెండు మినీ లారీలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అదే విధముగా రెండు లారీలను నెల రోజుల లోపల రికవరీ చేసిన సులూరుపేట ఎస్ ఐ పి. బాబును తడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని, ఏ ఎస్ ఐ శేఖర్, విజయ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని డి.ఎస్.పి అభినందించారు.
Post a Comment