సూళ్లూరుపేట:-
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర
ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సూళ్లూరుపేట లో ఘనంగా నిర్వహించారు. స్థానిక MLA కిలివేటి సంజీవయ్య పర్యవేక్షణలో వాడ వాడలా సీఎం జన్మదిన సంబరాలు అంబరాన్ని తాకాయి.మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి సారథ్యం లో TVRR కల్యాణ మండపం లో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరంలో 46 మంది రక్తదానం చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. అలాగే ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి నేతృత్వం లో కోటపోలూరు క్రాస్ రోడ్ లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం కోటపోలూరు గ్రామం లో YS రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం YS జగన్ పుటిన రోజు కేకును కట్ చేశారు.అలాగే KV రమణయ్య జ్ఞాపకార్థం MLA చేతులు మీదుగా 80 మంది వృద్దులకు దుప్పట్లు పంపిణి చేశారు. అనంతరం స్థానిక వైసీపీ కార్యాలయం లో సీఎం జన్మదినం సందర్భముగా ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఏర్పాటు చేసిన కేకును MLA కట్ చేసి అందరికి తినిపించారు.ఈ కార్యక్రమాలలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి ,AMC చైర్మన్ మారాంరెడ్డి కృష్ణ రెడ్డి, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ ,కౌన్సిలర్లు ముంగర శేషా రెడ్డి పంజుల విజయలక్ష్మి ,సన్నారెడ్డి సౌజన్య, తడ ఎంపీపీ రఘు ,శివాలయం చైర్మన్ నల్లబోయిన రాజసులోచనమ్మ,వైసీపీ నేతలు జెట్టి వేణు యాదవ్,కృపాకర్ రెడ్డి, ఛాంపియన్ చంద్ర రెడ్డి,గోగుల తిరుపాల్,అయిత శ్రీధర్,అలవల సురేష్,కాకి శ్రీరామమూర్తి ,మల్లి శ్రీనివాసులు,కళత్తూరు జనార్దన్ రెడ్డి,కళత్తూరు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment