సర్వమానవ సమానత్వం చాటే ‘పోలేరమ్మ జాతర’
అందుకే కావలిలో అమ్మవారి జాతర వైభవపేతంగా నిర్వహించడానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి భక్తి శ్రద్ధలతో చొరవ ఎంత ఎదిగినా మూలాలను మరవని వారే జన్మకు సార్ధకులౌతారని విజ్ఞులైనవారు గట్టిగా చెప్పే మాట. మూలాలతో ముడిపడి ఉన్న గొప్ప భక్తి కార్యాన్ని ఘనంగా నిర్వహించడానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేస్తున్న కృషి కావలి పట్టణంలోని పాత ఊరులో తీవ్ర చర్చనీయాంశమైంది.
నేటి సువిశాలమైన కావలి పట్టణం, వందల ఏళ్ల క్రితం ...కేవలం పాత ఊరు గా పిలవబడే పరిసరాలు మాత్రమే. నేటి పాత ఊరు...అంటే అప్పట్లో చిన్న గ్రామం. ‘అంతా దైవం పైనే భారం వేసాం’.... అనుకుంటూ మనం అనుకున్న వాటిని సాధించడానికి, కోరికలు తీరడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటాం... అలాగే ‘పాత ఊరు’ నాటి రోజుల్లో వర్షాలు కురవక సేద్యం కష్టంగా మారినా, వర్షాలు కురిసి పంటలు బాగా పండినా, అంటురోగాలు సోకకుండా ప్రజలు ఆరోగ్యంతో ఉన్నా, అంటురోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నా ‘పోలేరమ్మ తల్లి’ ఆగ్రహం/ సంతోషం అనే భావనలు అందరిలో కలిగేది. అదే నిజమనే బలమైన నమ్మకం కూడా. అందుకే పోలేరమ్మ తల్లి జాతర ను మొక్కుబడులు పెట్టుకోవడానికి, తీర్చుకోవడానికి నిర్వహించేవారు. గ్రామ శక్తి గా పోలేర్మ తల్లి జాతరను నిర్వహించడంలో నిర్లక్ష్యం, పొరపాట్లు వంటివి చోటు చేసుకుంటే గ్రామానికి కీడు గా భయాందోళనలు చెందేవారు.
కావలి పాత ఊరు లోని పోలేరమ్మతల్లి అమ్మవారి విశిష్టత కూడా అలాంటి శక్తి స్వరూపిణి. కావలి పట్టణం విస్తరించడంతో పాటు, ప్రజల ఆలోచన విధానం, నమ్మకాలు మారిపోవడంతో పోలేరమ్మ తల్లి అమ్మవారు కూడా నిర్లక్ష్యానికి గురైయ్యారు.
ఈ నేపధ్యంలో కావలి పట్టణంలోని పాత ఊరు ప్రాంతంలోనే పుట్టి పెరిగిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ‘పోలేరమ్మ తల్లి అమ్మవారు’ శక్తి పట్ల అపారమైన నమ్మకం. అందుకే తన బాల్యం నాటి పోలేరమ్మ తల్లి అమ్మవారి విశిష్టతలు మదిలో పదిలంగా ఉండటంతో పాటు, కులాలతో నిమిత్తం లేకుండా అందరూ ఐక్యమత్యంతో నిర్వహించే ‘పోలేరమ్మ జాతర’ నిర్వహించాలని బలంగా నిశ్చయించారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.
పేద– ధనిక, చిన్న–పెద్ద, ఎక్కువ–తక్కువ అనే సారుప్యాలు లేకుండా, అందరి మధ్య సాంస్కృతిక ఆచార వ్యవహార వారధిగా నిలిచే అమ్మవారి జాతర ఈ ఏడాది నుంచి క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.
ఇప్పటికే అమ్మవారి జాతరలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భాగస్వామ్యులు అయ్యే పాత ఊరు ప్రాంతంలోని వారితో సన్నాహాక సమావేశం జరిగేలా చేశారు. పాత ఊరులో పాత కాలం నాటి ‘పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర’ నిర్వహించే సంప్రదాయాన్ని, భవిష్యత్తు తరాలు కూడా వారసత్వంగా కొనసాగించేలా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిర్ధిష్టమైన శాశ్విత కార్యాచరణ ప్రణాళికకు రంగం సిద్ధం చేయడం పట్ల పాత ఊరు ప్రాంతంలోని అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.
పండగ, ఉత్సవం, జాతర, తిరునాళ్లు ...ఏదైనా అందర్నీ ఒక తాటిపై తెచ్చే భక్తిపూర్వకమైన వేడుక. అలాంటి పోలేరమ్మ తల్లి అమ్మవారి వేడుక కే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేస్తున్న భక్తిపూర్వకమైన ప్రయత్నం ఊరు మంచి కోసం....ఊర్లో జనాల మంచి కోసం.
Post a Comment