మొత్తం 750 కుటుంబాలకు ఆర్థిక సహాయం
భాదితులకు అండగా నల్లపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్
జిల్లాకు కనివిని ఎరుగని రీతిలో వరద పోట్టెత్తిందని అందునా కోవూరు ప్రాంతంలో ఉగ్ర రూపం దాల్చి ప్రజలను తీవ్రంగా నష్టపరిచిందని కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పడుగుపాడు నేతాజీ నగర్ లో ప్రసన్న పర్యటించారు. మొత్తం 750 వరద భాదిత కుటుంబాలకు నల్లపరెడ్డి ట్రస్ట్ తరపున ప్రత్యేక ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారని అన్నారు. రాత్రి సమయం చిమ్మ చీకట్లో ప్రమాదకరంగా నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు పడవలు తీసుకొని వెళ్లి భాదితుల ప్రాణాలను కాపాడారని ఇందుకు వారందరిని అభినందిస్తున్నాని అన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సహాయ శిబిరాలకు తరలించడమే కాకుండా అక్కడ వారికి అన్ని వసతులు అందేలా చొరవ చూపారన్నారు. ప్రభుత్వ సహాయం 2 వేలతో పాటు నిత్యావసరాలను వేగవంతంగా పంపిణి చేశారని గుర్తు చేశారు. వరద భాదితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకొనే వరకు వారికి అడుగడుగునా అండగా ఉంటామని ప్రసన్న భరోసా ఇచ్చారు. సహాయం చేయవలసిన సమయంలో టీడీపీ నాయకులు రాజకీయాలకు తెర తీశారని విమర్శించారు. టీడీపీ నేతల చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. సహాయం చేసేందుకు ముందుకు రమ్మని తానిచ్చిన పిలుపుకు స్పందించి ఇతోధికంగా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న దాతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేటి కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన దాతలు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, అనపల్లి అశోక్ రెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, అర్ కే చౌదరి బ్రదర్స్, పచ్చిపాలా రాధాకృష్ణా రెడ్డి తదితరులకు ప్రసన్న ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఏబీ ఛైర్మెన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, జడ్పీటీసీ కవరగిరి శ్రీలత, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, సొసైటీ ఛైర్మెన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి డీఎల్డీఏ డైరెక్టర్ కాటంరెడ్డి దినేష్ రెడ్డి, బొందిలి సంఘం ఛైర్మెన్ కిషోర్ సింగ్, ఉప సర్పంచ్ షేక్ అహ్మద్, ఎంపీటీసీ సున్నం బాబురావు, తురకా భాస్కర్, ప్రమిలమ్మ తదితరులున్నారు.
Post a Comment