ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం.. బ్రిటన్​లో లాక్​డౌన్​!


 ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం.. బ్రిటన్​లో లాక్​డౌన్​!

ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలని కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాలో​ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ నేపథ్యంలో కొత్త ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చింది. మరోవైపు.. బ్రిటన్​లో కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్​డౌన్​ వంటి కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. సింగపూర్​లో వ్యాక్సిన్​ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం.

Omicron death in Australia: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్​ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పలుచోట్ల కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ తీవ్ర ప్రభావం చూపుతోంది. గతవారం ప్రపంచంలో మొత్తం 51.45 లక్షల కేసులు నమోదు కాగా.. అంతకు ముందు వారంతో పోలిస్తే అది 13 శాతం అధికం. ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. న్యూ సౌత్​ వేల్స్​లో ఆదివారం 6వేల కొత్త కేసులు నమోదు కాగా.. ఒమిక్రాన్​ వేరియంట్​ మరణం నమోదైనట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

పశ్చిమ సిడ్నీలోని వృద్ధాప్య సంరక్షణ కేంద్రంలోని 80 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్​ వేరియంట్​తో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆయన పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ.. అనారోగ్య కారణాలతో మరణించినట్టు పేర్కొంది. 'అత్యధిక జనాభా కలిగిన న్యూ సౌత్​ వేల్స్​ రాష్ట్రంలో ఆదివారం 6,324 కొత్త కేసులు వచ్చాయి. ప్రస్తుతం 524 మంది ఆసుపత్రిలో ఉండగా.. 55 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు,' అని వెల్లడించింది.ఒమిక్రాన్​ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూ సౌత్​ వేల్స్​లో కొత్త ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. బార్లు, రెస్టారెంట్లల్లో 2 చదరపు మీటర్లకు ఒక వ్యక్తి మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది అక్కడి ప్రభుత్వం. ఆతిథ్య రంగంలో క్యూఆర్​ కోడ్​ ద్వారా తనిఖీలు చేయాలని తెలిపింది.యూకే లాక్​డౌన్​..!UK lockdown restrictions: బ్రిటన్​వ్యాప్తంగా కరోనా వైరస్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల్స్​, స్కాట్లాండ్​, ఉత్తర ఐర్లాండ్​ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇంగ్లాండ్​లో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చే అంశంపై ప్రధాని బోరిస్​ జాన్సన్​, ఆయన మంత్రివర్గం సోమవారం సమీక్షించనుంది. ప్రస్తుతానికి ఇంటి నుంచే పని, మాస్క్​, కొవిడ్​ టీకా ధ్రువపత్రం తప్పనిసరి వంటి ప్లాన్​ బీ చర్యలు అమలులో ఉన్నాయి. మరోవైపు.. వేల్స్​లో రాత్రి క్లబ్​లు ఆదివారం నుంచి మూసివేయాలని ఆదేశించారు. పబ్బులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లల్లో ఆరుగురుకి మించి గుమికూడదు. ఇండోర్​ ఈవెంట్స్​కు 30 మంది, బహిరంగ ప్రదేశాల్లో 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు.

సింగపూర్​లో వ్యాక్సిన్​ తప్పనిసరి.. ​Singapore restrictions for travelers: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది సింగపూర్​. వర్క్​ పాసులు, దీర్ఘకాల పాసులు, శాశ్వత నివాసాల దరఖాస్తులు ఆమోదించాలంటే.. కొవిడ్​ వ్యాక్సినేషన్​ తప్పనిసరి చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. అలాగే.. వర్క్​ పాసులు పునరుద్ధరణ చేసుకునేవారు సైతం తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందేనని తెలిపింది. అయితే, 12 ఏళ్లలోపు పిల్లలు, వైద్య పరంగా వ్యాక్సిన్​కు అర్హత లేనివారికి ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది.ఒమిక్రాన్​ వేరియంట్​ నేపథ్యంలో 10 ఆఫ్రికా దేశాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది సింగపూర్​. రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య రెండింతలు పెరుగుతుందని నిపుణులు హెచ్చరించటం ప్రాధాన్యం సంతరించుకుంది. బోట్స్​వానా, ఈస్వతిని, ఘనా, లెసోతో, మాలావి, మోజాంబిక్​, నమీబియా, నైజీరియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేల నుంచి గత 14 రోజుల నుంచి సింగపూర్​ వచ్చిన వారిపై కేటగిరి 4 ఆంక్షలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి తీసుకొచ్చింది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget