అక్కరపాక గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అంబేద్కర్ మునిమనవడు రాజారత్నం అశోక్ అంబేద్కర్.
నెల్లూరు జిల్లా:- దొరవారిసత్రం మండలంలోని అక్కరపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముని మనవడు రాజారత్నం అశోక్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం జ్యోతి ప్రజ్వలను వెలిగించారు. అనంతరం రాజారత్నం అశోక్ అంబేద్కర్ మరియు ఆయన కుమారుడు మీడియా తో మాట్లాడుతూ అంబేద్కర్ భారత దేశానికి ఎనలేని సేవలు చేశారని, భారత రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన, పేద ప్రజల గుండెల్లో స్థిరస్తాయిగా నిలిచిపోయారని అదేవిధంగా అట్టడుగున ఉన్నటువంటి పేదల ప్రజల కొరకు ఎన్నో సేవలు చేశారని,భారత దేశంలో ప్రతి ఒక్క పేదవారు ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఆ మహానేత భారత రాజ్యాంగాన్ని నిర్మించారని, ఆయన బాటలోనే మనమందరము కూడా నడిచి ఆయన కోరికలు నెరవేర్చాలని కుల, మత భేదాలు అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలలనుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభిమానులు మరియు దళిత సంఘాల నాయకులు పాల్గొని జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్..... జోహార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ... జై భీమ్.... జై భీమ్.... అంటూ నినాదాలు చేస్తూ ఈ సభను జయప్రదం చేశారు.
Post a Comment