అధికారులారా... తప్పులతడక గా ఉన్న కావలి, అల్లూరు ఓటర్ల జాబితా ను సరి చేయండి - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ , నియోజకవర్గ పరిశీలకులు గూడపాటి శ్రీనివాస్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, సుబ్బానాయుడు,గ్రంధి యానాది శెట్టి, బీద గిరిధర్, గుత్తికొండ కిషోర్, కోడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, మొగలి కల్లయ్య, కండ్లగుంట మధు బాబు నాయుడు, పోతుగంటి అలేఖ్య, బొగ్గవరపు శ్రీనివాసులు, తిరుమల నాయుడు, కొండూరు పోలిశెట్టి, కాకి ప్రసాద్, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, మండువ వెంకట్రావు, కర్నాటి సుబ్బారావు, బండి శ్రీనివాసులు రెడ్డి, మాలేపాటీ నాగేశ్వర రావు, కోసూరి వెంకటేశ్వర్లు, జ్యోతి బాబు రావు తదితరులు. కావలి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం...అనంతరం మీడియాతో బీద రవిచంద్ర మాట్లాడుతూ. త్వరలో జరగనున్న కావలి, అల్లూరు ఎన్నికల ఓటర్ల లిస్ట్ జాబితా లలో అవకతవకలు అధికంగా ఉన్నాయి. కావలి, అల్లూరు ఎన్నికల ఓటర్ల జాబితా లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. నెల్లూరు, ఇతర మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల సంబంధించి ఓటర్ల లిస్ట్ జాబితా లలో అవకతవకలు కారణంగా అధికార వైసీపీ పార్టీ లాభ పడింది. ఓటర్ లిస్ట్ జాబితా లో అవకతవకలు పసిగడతారనే అనుమానం తో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల కు చివరి రోజు వరకు ఓటర్ల జాబితా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ను పరిశీలిస్తే నెల్లూరు రూరల్ ఓటర్లను అర్బన్ లో, అర్బన్ ఓటర్ల ను రూరల్ లో కలపడం, నగరం నాలుగు మూలల లోని ఓటర్ల ను కలిపి ఒక వార్డు లో కలిపి ఓటర్లను తికమక పెట్టి ఓటింగ్ కు దూరం చేశారు. కావలి, అల్లూరు ఓటర్ల లిస్ట్లు ఒకసారి పరిశీలన చేస్తే కావలి పట్టణ ఓటర్ల జాబితా ఏ ఒక్క వార్డు ఓటర్లు కూడా మున్సిపాలిటి ఇచ్చిన వార్డు పరిధిలోకి లేవు. ప్రతి వార్డులో 20 బూతుల్లో నుంచి 40 బూతులలోని ఓటర్లను చేర్చడం జరిగింది. ఒకే డోర్ నెంబర్ మీద 70 నుంచి 100 వరకు అక్రమ ఓటర్ లను నమోదు చేశారు.చౌదరి పాలెం లోని 600 ఓటర్ల ను ఆరు వార్డుల్లో చేర్చారు. బృందావనం కాలనీ ఓటర్ల ను అనేక వార్డుల్లో చేర్చారు. పక్క గ్రామాల వారిని ఇతర రాష్ర్టాల వారిని కూడా ఓటర్లు గా చేర్చడం జరిగింది. అధికార పార్టీ ఒత్తిడి తో అధికారులు ఓటర్ల లిస్ట్ ను గందరగోళంగా మార్చి వేశారు. మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో లను కలిసి ఓటర్ల లిస్ట్ లో తప్పులు సరి చేయమని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. కావలి ఓటర్ల లిస్ట్ సరిదిద్దమని కలెక్టర్ గారికి ఇప్పటికే ఉత్తర్వులు అందాయి. కావలి, అల్లూరు ఓటర్ల లిస్ట్ లను అధికారులు వెంటనే సరి చేయని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్ధితి వస్తుందని హెచ్చరించారు.
Post a Comment