గూడూరు పట్టణంలో గల శ్రీ సరస్వతి శిశు మందిరం నందు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు భగవద్గత కంఠస్థ పోటీలు 17 వ అధ్యాయం లో జరిగినది. ఈ పోటీలోఎల్కేజీ నుండి మూడో తరగతి వరకు, పది శ్లోకాలు, నాలుగో తరగతి నుండి ఏడో తరగతి వరకు 15 శ్లోకాలు, ఎనిమిదవ తరగతి నుండి పదో తరగతి వరకు ఇరవై శ్లోకాలు, ప్రతి విద్యార్థి ఈ భగవద్గీత కార్యక్రమంలో పాల్గొని శ్లోకాలు చెప్పడం జరిగింది. దీనిలో పాల్గొన్న విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ,తృతీయ, బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదములు ఏర్పాటు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం. మురళి రెడ్డి,ఉపాధ్యక్షులు డివి. రమణారెడ్డి,కార్యదర్శి సిహెచ్.వెంకటరమణయ్య, కోశాధికారి ఆర్. రవి చంద్ర రెడ్డి,ప్రకాండ అధ్యక్షులు జోసెఫ్,కార్యదర్శి రామ్మూర్తి, కార్యకర్తలు సిహెచ్.వెంకటరమణయ్య, ఐ.ఆనంద్ రావు, జి.ముని కోటేశ్వరరావు, ఆర్. లావణ్య (రామాఆచార్య) కే.సుబ్బారావు, ప్రసాద్,రాజేంద్ర,రమేష్, జనార్ధన్,ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి, ఆచార్యులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు,కృతజ్ఞతలు తెలపడం అయినది.
Post a Comment