రాజకీయాలంటే ఎత్తుకు పై ఎత్తులు కాదు...
రాజకీయాలంటే ప్రజల్లో ఉండడం, ప్రజలకు సేవ చేయడం...
సమాజంలో మార్పు తేవాలంటే, రాజ్యాధికారం రావాలి....
రాబోవు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి....
వ్యాపారాలు, కుటుంబాలను వదులుకుని రాజకీయాలు చేస్తున్నాం....
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది....
నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో గురువారం సాయంత్రం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ 23, 26 డివిజన్ ల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల పరిణామాలతో నిరుత్సాహ పడవద్దని.... జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు అనైతికంగా జరిగాయని, వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేశారని అన్నారు. సమాజంలో మార్పు తేవాలంటే రాజ్యాధికారం అవసరమని, రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయం బాధ్యతతో చేయాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ నీ అధికారం లోకి తీసుకుని రావాలని అన్నారు. రాష్ట్రం ఊబిలో కూరుకుపోయిందనీ, రాష్ట్రాన్ని ఊబిలో నుంచి బయటకు తీసుకురాగల సామర్థ్యం చంద్రబాబు గారికి మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు. మనం చేసే కార్యం పవిత్రతతో దైవ కార్యం గా భావించి చేయాలని, రాజకీయాలను కాలక్షేపంగా చేస్తే మన బిడ్డల భవిష్యత్తు కు మంచిది కాదని అన్నారు.
Post a Comment