"రైతులతో కలిసి కాకాణి పర్యటన"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో కనుపూరు కాలువ మరమ్మత్తు పనులను రైతులు, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
రైతులకు ఎరువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
భారీ వర్షాలతో సంభవించిన వరదల వల్ల గండిపడిన సాగునీటి కాలువలు, చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు పూర్తి చేశాం. సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి సజావుగా, సాఫీగా సాగునీరు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. వరద తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించడానికి నెల్లూరు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు రైతాంగ సమస్యల పట్ల స్పందించి, తక్షణమే అవసరమైన మరమ్మత్తులు చేపట్టవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ అధికారులు తయారుచేసిన అంచనాల ప్రకారం మరమ్మతులకు 48 కోట్ల రూపాయలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. తెలుగుదేశం పాలనలో అధికారం వెలగబెట్టిన వారు మంజూరైన పనులను చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. ప్రతిపక్షంలో శాసనసభ్యునిగా ఆనాడు రైతులతో కలిసి తెలుగుదేశం నాయకులు రైతుల పేరిట చేపట్టిన దోపిడీని బట్టబయలు చేశాం. వరదల కారణంగా దెబ్బతిన్న కాలువలను, చెరువులను చూసి, సాగునీరు అందదేమోనని రైతులు తీవ్ర ఆందోళన చెందారు. వరదలలో రైతులతో కలిసి చెరువులు, కాలువలు సందర్శించి, ధైర్యంగా ఉండాలని, ప్రతి సెంటు పొలానికి నీరు అందిస్తానని మాటిచ్చాం. సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి మాటిచ్చిన విధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సెంటు పొలానికి సాగునీరు అందిస్తాం. రైతాంగానికి అవసరమైన ఎరువులను అందుబాటులోకి తెచ్చి, ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేస్తాం. రైతులు కోరుకున్న విధంగా వారి అవసరాల మేరకు వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, యాంత్రీకరణ సామాగ్రి అందిస్తున్నాం. రైతాంగానికి సాగు నీరందించడానికి రేయింబవళ్లు శ్రమించి, త్వరితగతిన మరమ్మత్తులు పూర్తి చేసిన నీటి పారుదల శాఖ అధికారులకు, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, చిన్న సమస్య కూడా రానీకుండా చర్యలు చేపడుతాం.
Post a Comment