వాకాడు యందు వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి పుట్టినరోజు వేడుకలు

 వాకాడు: నెల్లూరు జిల్లా



వాకాడు యందు  వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి పుట్టినరోజు వేడుకలు వాకాడు SALC హైస్కూల్ యందు  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బోర్డు ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పిల్లల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు  వారి సొంత నిధులతో భోజనం ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జనహృదయ నేత వై.ఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నామని తెలిపారు. అలాగే

నిరంతరం ప్రజాహితం కోసం పాటుపడుతూ గత రెండున్నరేళ్ల కాలంలో ఇంతటి సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనివిధంగా పాలన సాగిస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి మాత్రమేనని అన్నారు.

అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి అయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, అందుకు రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలంతా సంపూర్ణ ఆశిస్సులు అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల రెడ్డి, వాకాడు మాజీ ఎంపీపీ పల్లపల్లి వెంకటేశ్వర్లు, వాకాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు భాస్కర్ రెడ్డి, ఎందుకు సుధాకర్ నాయుడు,వాకాడు గ్రామ ఉపసర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, వాకాడు మండల ఉపాధ్యక్షులు వెంకటరమణయ్య, వాకాడు ఏఎంసి చైర్మన్ వాకాటి నాగభూషణమ్మ, వాకాడు గ్రామసర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, మండల తాసిల్దార్ పద్మావతి,ఎంపీడీవో గోపీనాథ్, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget