కరోనా తో మృతి చెందిప పాత్రికేయుల కుటుంబాలకు సాయం అందంచాలి.
జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి హామీ కి జాప్ హర్షం
అదే బాటలో మిగిలిన సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలులో జా ప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి స్పష్టం
ఒంగోలు : కరోనా తో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా సాయం అందించాలని జాప్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా తో మృతి చెందిన పాత్రికేయులకేగాక అనారోగ్యంతో మృతి చెందిన వారికి జనవరి 15 వ తేదీని చెక్ లు పంపిణీ చేయనుంది.ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాత్రికేయుల ను ఆదుకోవాలని జాప్ కోరుతోంది.రాష్ట్రంలో
పాత్రికేయుల కు స్ధలం కేటాయించడమే కాదు ఇళ్లు కట్టి ఇస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం పట్ల జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్ ) హర్షం వ్వక్తం చేసింది. ఇదే మాదిరిగా
ప్రభుత్వం జర్నలిస్టు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి విలేకరులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి హితవు పలికారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాలలో పర్యటిస్తున్న జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డిని శనివారం సాయంత్రం ఓంగోలులో లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకారెడ్డి ఆధ్వర్యంలో కలిసి ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ లో ఎండీవీ ఆర్ ఎస్ పున్నం రాజు, ఎం యుగంధర్ రెడ్డి లసారథ్యంలో మాత్రమే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్( జాప్ )యూనియన్ ఒక్కటే ఉందని స్పష్టం చేశారు. మిగతా వ్యక్తులు జా ప్ పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్రంలోని జర్నలిస్టు సోదరులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జాప్ పేరుతో తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు తమసభ్యులు కాదని జర్నలిస్టులు గమనించాలని విజ్ఞప్తి చేశారు .జా ప్ ప్రతిష్టలకు ,నాయకుల గౌరవానికి భంగం కలిగేలా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అక్రిడేషన్ కమిటీ లకు ఇచ్చిన జీవో లో సైతం పున్నం రాజు, యుగంధర్ రెడ్డిల జా ప్ యూనియన్ కె గుర్తింపు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో దరఖాస్తు చేసిన విలేకర్ల అందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు ల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీ జర్నలిస్టులoదరినీ ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి, కరోనా ఆర్థిక సహాయం కింద ప్రత్యేకంగా ఆదుకోవాలని జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు .త్వరలోనే అన్ని జర్నలిస్టు సంఘాల తో కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దగ్గుమాటి వెంకారెడ్డి ,గోపాల్,సుందరంవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment