శ్రీ చెంగాళమ్మ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కాళంగి నది ఒడ్డున వెలసివున్న తెలుగు తమిళ ఆరాధ్యదైవం భక్తుల కొంగు బంగారం అయినా శ్రీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో నేడు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య చేతులమీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారిఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం నిర్వహించి పూజలు నిర్వహిస్తామని,అమ్మవారు భక్తులకు బంగారు చీరతో దర్శనం ఇస్తుందని కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప కటాక్షం పొందాలని కోరుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు కలత్తూర్ శేఖర్ రెడ్డి ఆలయ పాలకవర్గ సభ్యులు గోగుల తిరుపాల్ ఎక్స్ AMC జెట్టి వేణు యాదవ్, కళత్తూరు కలెక్టర్ శేఖర్ రెడ్డి తరులు పాల్గొన్నారు.
Post a Comment