అధిక ఫీజులు వసూలు చేసే జూనియర్ కళాశాలల పై చర్యలు తీసుకోండి ఏబీవీపీ నాయకులు

అధిక ఫీజులు వసూలు చేసే జూనియర్ కళాశాలల పై చర్యలు తీసుకోండిగూడూరు కు వచ్చిన ఆర్ఐఓ గారికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ గూడూరు నాయకులు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సెంట్ మేరీస్ కళాశాల వద్ద గూడూరు పట్టణంలో జూనియర్ కళాశాలలు కు తనిఖీకి వచ్చిన 
ఆర్ ఐ ఓ గారికి ఏబీవీపీ గూడూరు శాఖ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న జూనియర్ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు అదేవిధంగా నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బందిపడుతున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పరీక్ష ఫీజులు 800 రూపాయలు వసూలు చేస్తున్నారని వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గూడూరు పట్టణంలోని జూనియర్ కళాశాలలో ల్యాబ్ లు వసతుల లేని కళాశాలల పై చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం అందజేశారు
సానుకూలంగా స్పందించిన ఆర్ఐఓ గారు
ఏబీవీపీ నాయకులు తెలియజేసిన సమస్యలను తెలుసుకున్న ఆర్ ఐ ఓ గారు వెంటనే సమస్యలపై చర్యలు తీసుకుంటామని అధిక ఫీజులు వసూలు చేసే వారిపై నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ జిల్లా కన్వీనర్ చిన్న చరణ్ మహేష్ నవీన్ కిరణ్ ప్రదీప్ పురుషోత్తం శంకర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు
Labels:

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget