విజయవాడలో రీజినల్ క్వాలిటీ కంట్రోల్ లాబొరేటరీ ని ప్రారంభించిన పేర్నాటి దంపతులు
తక్కువ సమయంలోనే లాబొరేటరీ పుననిర్మాణం
సహకరించిన సియం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు:పేర్నాటి
లాబోరేటరీ ద్వారా నాణ్యమైన విత్తనాలను గుర్తింపు
రైతులకు నకిలీ విత్తనాల బెడద నుండి విముక్తి
పేర్నాటి దంపతులు వెల్లడి
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు గురువారం విజయవాడ ప్రసాదంపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రీజినల్ క్వాలిటీ కంట్రోల్ లాబొరేటరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుష్మిత ,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి దంపతులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా పేర్నాటి దంపతులు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే లాబొరేటరీని పునర్నిర్మించి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు, లాబొరేటరీని పున నిర్మించేందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం అన్నారు.
లాబోరేటరీ ద్వారా నాణ్యమైన విత్తనాలను గుర్తించి, రైతులకు నకిలీ విత్తనాల బెడద నుంచి విముక్తి కలుగుతుంది అని వారు చెప్పారు. రైతులకు లాబోరేటరీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తమ లక్ష్యం రైతు సంక్షేమం అని,రైతు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అని తెలిపారు.
రైతులు రాత్రి పగలు కష్టపడి పనిచేసి ధాన్యం పడించడం వలన ప్రతి ఒక్కరికీ నోటిలో నాలుగువేళ్ళు పోతున్నాయి అని, అలాంటి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే బాధ్యత తమపై ఉంది అన్నారు.నకిలీ విత్తనాలు సరఫరా ఎవరూ చేసిన తగు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది, వైసీపీ నేతలు పాదర్తి రాధా కృష్ణా రెడ్డి, దువ్వూరు సాయి కృష్ణా రెడ్డి,చిల్లకూరు వెంకు రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్,ఇన్నమాల వెంకట్రాది, ఉప్పల రఘు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment