ఒక్క రూపాయి చెల్లించకండి.. రాబోయేది టీడీపీ ప్రభుత్వం ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తాం..














 ఒక్క రూపాయి చెల్లించకండి.. రాబోయేది టీడీపీ ప్రభుత్వం ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తాం..

రాష్ట్ర పాలన సాగించలేక, ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు....

ఓటిస్ వసూళ్ళ పేరుతో పేదల మెడకు ఉరితాళ్ళు బిగిస్తున్నారు...

వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక, ఇళ్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు తాళాలు ఇవ్వని కీచకుడు జగన్ రెడ్డి....

అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి. ఓటిఎస్ కు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి పాశం సునీల్ కుమార్, ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి బొల్లినేని వెంకట రామారావు, వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్ కురుగొండ్ల రామకృష్ణ, కంభం విజయరామిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, చెంచల్  బాబు యాదవ్, తాళ్ళపాక అనురాధ, వెనటి సతీష్ రెడ్డి,  సుబ్బానాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, జిల్లాలోని పది నియోజకవర్గాల రాష్ట్ర స్థాయి పార్లమెంట్ స్థాయి, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు ప్రదర్శనగా వచ్చారు.

ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ తిక్కన భవన్ లో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు కు ప్రభుత్వం చేస్తున్న ఓటీఎస్ వసూళ్లకు నిరసనగా వినతిపత్రాన్ని అందజేశారు... కలెక్టరేట్ గేట్ వద్ద టిడిపి నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది... కలెక్టరేట్ గేట్లు నెట్టుకుంటూ టిడిపి నేతలు, కార్యకర్తలు ముందుకు వెళ్ళారు.. వినతి పత్రం అందించిన అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ...

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఓటీఎస్ వసూళ్ళు- పేదలమెడకు ఉరితాళ్ళుగా మారాయని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఓటిఎస్ పేరుతో గ్రామాల్లో అధికారులు పేద ప్రజల నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎప్పుడో 30,40 సంవత్సరాల క్రితం నిర్మించిన గృహాలకు ఇప్పుడు ఎందుకు నగదు చెల్లించాలని టిడిపి నేత అజీజ్ ప్రశ్నించారు... వాలంటీర్లు ప్రజలను సంక్షేమాలను రద్దు చేస్తామని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు అని తెలిపారు.. ఎంపిడివో లను వాలంటీర్ లను అడుగుతుంటే కలెక్టర్ ప్రెజర్ తో వసూళ్లు చేపడుతున్నామని చెబుతున్నారని తెలిపారు..

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు మూడు పూటలా తిండి దొరకడం లేదని రైతులు పంట పండించే స్థితిలో లేక కన్నీరు కారుస్తున్నారని అన్నారు.. గతంలో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు ఓటేసి కట్టించుకోవడం ఏమిటని ఎవరికో పుట్టిన బిడ్డలకు మీరు పేరు పెట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14 లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయనీ,రెండున్నర లక్షల ఇళ్లు పూర్తికాబడ్డాయని, ఉదాహరణకి నెల్లూరులో నాలుగు వేల గృహ ప్రవేశాలు జరిగాయి అని తెలిపారు...అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఉచితంగా ఇస్తానని చెప్పి, పేద ప్రజలకు తాళాలు ఇవ్వని కీచకుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు.. ఆడబిడ్డలకు కట్నకానుకలు ఇచ్చిన పిల్లలకు సైతం కట్టమని అడగడం దారుణమైన చర్య అని, పేద ప్రజల గొంతు పై కత్తి మోపి ఓటియస్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు...ఎవరు కూడా ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు.

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget